DailyDose

విశాఖ రుషికొండ బీచ్‌లో జంట మృతదేహాల కలకలం – TNI నేటి నేర వార్తలు

విశాఖ రుషికొండ బీచ్‌లో జంట మృతదేహాల కలకలం –  TNI   నేటి నేర వార్తలు

* విశాఖ రుషికొండ బీచ్‌ లో జంట మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. నిన్న రుషికొండ తీరానికి ఓ యువకుడి మృతదేహాం చేరుకుంది. మృతుడు నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. కాగా ఈరోజు తెల్లవారుజామున యువతి మృతదేహాం రుషికొండ తీరానికి కొట్టుకువచ్చింది. మృతురాలు విజయనగరంకు చెందిన దివ్యగా గుర్తించారు. ఇద్దరు మృతి చెందడం వెనుక ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*జగ్గంపేట పోలీసులు తన భర్త శ్రీరామ్‌ను బలవంతంగా తీసుకెళ్లి కొడుతున్నారంటూ..భార్య సురేఖ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ పై శుక్రవారం ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది. సురేఖ తరపున లాయర్‌ జడ శ్రవణ్‌ కోర్టుకు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్‌కు సంబంధించిన ఫొటోలను ప్రభుత్వ లాయర్ కోర్టుకు చూపించారు. అయితే తేదీ, సమయం లేకుండా ఫుటేజ్‌ ఫొటోలను ఎలా నమ్ముతామని లాయర్ శ్రవణ్‌ ప్రశ్నించారు. తనను పోలీసులు తీసుకెళ్తున్నారని భార్యకు శ్రీరామ్ ఫోన్‌ చేసిన మొబైల్ స్విచ్చాఫ్‌లో ఉందని హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుందని లాయర్ శ్రవణ్ వాదించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

*చాపాడు స్టేషన్ పరిధిలో బిల్లులు లేని ఐదున్నర కేజీల బంగారు ఒకటిన్నర కోటి డబ్బును సీజ్ చేసిన పోలీసులు…తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ప్రొద్దుటూరు కు తీసుకెళ్తుండగా తనిఖీల్లో పట్టుబతినట్లు తెలిపిన పోలీసులు…బంగారం డబ్బును ఐటీ శాఖ అధికారులకు అప్పగించి విచారణ చేస్తున్న పోలీసులు.

*సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అప్పుల బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ) గోదేశి నరేంద్రబాబు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి పొద్దుపోయాక సూర్యాపేటలోని తన ఇంట్లో నరేంద్రబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే స్వగ్రామమైన రాఘవపురంలో అంత్యక్రియలు జరగకుండా రుణదాతలు అడ్డుకున్నారు. దీంతో నిన్నటి నుండి ఆందోళన కొనసాగుతోంది. నరేంద్రబాబు సుమారు రూ.20 కోట్లు అప్పుచేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాము ఇచ్చిన డబ్బులు ఇచ్చేంత వరకు అంత్యక్రియలు జరిగేది లేదని రుణదాతలు స్పష్టం చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

*మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో దుండుగలు చోరీకి తెగబడ్డారు. మహబూబాబాద్ స్టేషన్‌లో గోల్కొండ ట్రైన్ ఎక్కుతుండగా ఓ మహిళ దగ్గర నుండి దొంగలు బ్యాగ్ కొట్టేశారు. బ్యాగ్‌లో తులం బంగారం, దిద్దులు, సెల్ ఫోన్, నగదు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఇల్లెందుకు చెందిన సుమలత తన అన్నకు రాఖీ కట్టడానికి వరంగల్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ రైల్వే పోలీసులకు బాధితురాలు సుమలత ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో భారీగా బంగారం పట్టుబడింది. బెహరాయిన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర రూ.14 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్‌ చేశారు. బంగారాన్ని పేస్ట్‌గా మార్చి తరలిస్తుండగా పట్టుకున్నారు. వెంటనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

*శంషాబాద్‌లో ఇంటి వద్ద పార్క్ చేసిన ఆటోను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. మహేష్ అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన ప్యాసింజర్ ఆటోను అర్దరాత్రి గుర్తుతెలియని దుండగలు ఎత్తుకెళ్లారు. ఆటోను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమారాల్లో రికార్డ్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఆటో అపహరణపై శంషాబాద్ పోలీసులను అశ్రయించి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన మహేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. మరో కేసులో బిజీగా ఉన్నాం గంట తరువాత రావాలంటూ శంషాబాద్ రూరల్ పోలీసులు తిరిగి పంపించి వేశారు.

* శంషాబాద్‌లో ఇంటి వద్ద పార్క్ చేసిన ఆటోను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. మహేష్ అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన ప్యాసింజర్ ఆటోను అర్దరాత్రి గుర్తుతెలియని దుండగలు ఎత్తుకెళ్లారు. ఆటోను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమారాల్లో రికార్డ్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఆటో అపహరణపై శంషాబాద్ పోలీసులను అశ్రయించి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన మహేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. మరో కేసులో బిజీగా ఉన్నాం గంట తరువాత రావాలంటూ శంషాబాద్ రూరల్ పోలీసులు తిరిగి పంపించి వేశారు. దీంతో ఆటో యజమాని మహేష్ ఆందోళన వ్యక్తం చేశాడు.

*ఒక మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌, హోటల్‌ గదిలో అనుమానాస్పదంగా మరణించింది. ఒక కేసు దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఆమె అక్కడ చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25 ఏళ్ల కవితా కుమారి బీహార్‌ ముజఫర్‌పూర్ జిల్లాలోని బ్రహ్మపుత్ర పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్నది. 2021లో నమోదైన చీటింగ్‌ కేసుపై దర్యాప్తు కోసం ఆమెతోపాటు మరి కొందరు పోలీసులు మహారాష్ట్రలోని పూణేకు వెళ్లారు.

*ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుపై వైద్యుడి కన్ను పడింది. మాయ మాటలు చెప్పాడు, నీ జీతం, ఆస్తి, రంగుతో సంబంధం లేదన్నాడు. ఓకే అంటే పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అంటూ తేనె మాటలు చెప్పి నర్సును శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లిమాట ఎత్తిన నర్సును నోరు మూపించేందుకు పలు ప్రయత్నాలు చేసి, భౌతిక దాడికి సైతం దిగడంతో తనకు న్యాయం చేయాలంటూ నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ మెట్లిక్కిందో నర్సు.

*పన్ను కట్టకుండా అక్రమంగా కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి కోయంబత్తూరుకు తీసుకెళ్తుండగా.. వైఎస్సార్ జిల్లా చాపాడులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 3కిలోల బంగారంతో పాటు, రూ.1.30కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

*తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఏట్లో గల్లంతవగా.. గాలించడానికి వచ్చిన సహాయక సిబ్బందిలో ఒకరు నీట మునిగి మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. సుర్దేపల్లిలో గ్రామంలో పాలేరు ఏటిపైనున్న చెక్‌డ్యాం కమ్‌ బ్రిడ్జి వద్ద గురువారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రిడ్జి వద్ద చేపలు పట్టేందుకు.. అదే మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గురువారం ఉదయం 5 గంటలకు వచ్చారు.

* బిహార్ రాష్ట్రంలోని కైమూర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన ట్రక్ డ్రైవర్ మృతి చెందాడు. జిల్లాలోని మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాణా ప్రతాప్ కళాశాల సమీపంలో.. ట్రక్కులో టమోటాలు దించేందుకు వచ్చాడు. అక్కడినుంచి వాహనం దిగి కాలినడకన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతన్ని పోలీసులు సబ్‌ డివిజనల్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు రాష్ట్రంలోని కడప జిల్లా కోట కోటోలుకు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ కుమారుడు సాల్ఫ్‌ ఖాజావలి(36) అని సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భబువా సదర్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*ఉపాధి దొరకలేదని తిరిగి వెళ్తానంటే.. వెళ్లనివ్వలేదని కోపంతో ఇద్దర్ని హతమార్చాడు. ఆపై గ్యాస్‌సిలిండర్లను పేల్చి ఆత్మహత్య చేసుకోవాలనుకొని ధైర్యం చాలక కిటికీ నుంచి దూకి పారిపోయాడు. జీడిమెట్ల పోలీస్స్టేషన్ రాంరెడ్డినగర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు 17 రోజుల తర్వాత చిక్కుముడి వీడింది. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్‌ ఏసీపీ గంగారం వివరాలు వెల్లడించారు.

*స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు చేసిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తోన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున తూటాలను స్వాధీనం చేసుకున్నారు

* నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముప్కాల్‌ మండలం కొత్తపల్లి దగ్గర 44వ జాతీయ రహదారిపై ఓ కారు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

*కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ.. వరుసకు కోడలయ్యే మహిళను అతి కిరాతకంగా హతమార్చింది. తన సోదరుని కుమారుడితో కలిసి ఆమె తలనరికి.. దాన్ని పోలీస్‌ స్టేషన్‌ వరకూ తీసుకెళ్లి లొంగిపోయింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో గురువారం ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం మేరకు, కలకడ మండలం గుట్టపల్లెకు చెందిన పాకాల వసుంధరకు రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురానికి చెందిన రాజాతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలున్నారు. రాజా 11 ఏళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఏడాది క్రితం వసుంధర అత్తకూడా అనారోగ్యంతో మరణించింది. ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న వసుంధర తన ఇద్దరు కుమార్తెలతో కలసి ఉంటోంది. వాళ్లు పై పోర్షన్‌లో ఉంటుండగా.. కింది భాగంలో వసుంధర అత్తకు చెల్లిలైన సుబ్బమ్మ ఉంటోంది. ఆమె ఒంటరి మహిళ. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సుబ్బమ్మ ఏదో మాట్లాడాలని పిలవడంతో వసుంధర ఆమె ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో సుబ్బమ్మ సోదరుని కుమారుడు చంద్రబాబు అక్కడే ఉన్నాడు. కొన్ని రోజులుగా వీళ్ల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుబ్బమ్మ, చంద్రబాబు కలిసి వసుంధర తల తెగనరికారు. అనంతరం సుబ్బమ్మ.. మృతురాలి తలను ఒక చేత్తో.. మరొక చేత్తో కత్తిని పట్టుకుని కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. పట్టపగలు కావడంతో.. ఆ దృశ్యం చూసి జనం హడలిపోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

*కుమరం భీం మనుమడు కుమరం సోనేరావుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన గురువారం కాగజ్‌నగర్‌ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన 75వ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల వంశస్థులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆహ్వానించారు. ఈ మేరకు కాగజ్‌ నగర్‌ రైల్వే ప్రొటెక్షన్‌ పోలీసులు సిర్పూర్‌(యూ) మండలంలోని పెద్ద దొబా గ్రామానికి చేరుకుని సోనేరావును రైలులో తీసుకెళ్లారు. ఢిల్లీలో సోనెరావుకు సన్మానం చేస్తారని, రెండు రోజుల అనంతరం సోనేరావు, అల్లూరి సీతారామరాజు వారసులు రాష్ట్రపతితో భేటీ అవుతారని రైల్వే అధికారులు తెలిపారు.

*హాస్టల్‌ పైకప్పు పెచ్చులూడి పడడంతో బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థికి గాయాలయ్యాయి. పీయూసీ-1 చదువుతున్న దీమత్‌ అనే విద్యార్థి తరగతులకు వెళ్లేందుకు వసతి గృహంలో రోజూ మాదిరిగానే సిద్ధమవుతున్న సమయంలో.. భవన పైకప్పు నుంచి పెచ్చులూడి తలపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ ఆదేశాలతో సిబ్బంది వెంటనే దీమత్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు నవీపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయం పెద్దదిగా ఉండడంతో ఆరు కుట్లు పడ్డాయని తెలిసింది. దీమత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పీఆర్వో విజయకుమార్‌ తెలిపారు.

*భార్యాభర్తలిద్దరూ ప్రభు త్వ ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన సంతానం. కానీ అప్పుల ఊబి ఆ ఇంటి పెద్దను మింగేసింది. వడ్డీ వ్యాపారంలో నష్టాలకు తోడు, ఏపీ రాజధాని అమరావతి భూములపై పెట్టిన పెట్టుబడులు ఆ కుటుంబాన్ని ఆర్థిక సుడిగుండంలోకి నెట్టాయి. రూ.15 కోట్లకు పైగా చేరిన అప్పులకు నెలనెలా రూ.20 లక్షల వడ్డీ చెల్లించలేక.. ఆ ఇంటి పెద్ద బలవన్మరణం పొందారు. సూర్యాపేటలో గురువారం ఈ ఘటన జరిగింది. మునగాల మండలం విజయరాఘవపురానికి చెందిన గోదేశీ నరేంద్రబాబు(55), భార్య ధనలక్ష్మి, ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన కొడుకు, కూతురుతో కలిసి సూర్యాపేటలో నివాసముంటున్నారు. నరేంద్రబాబు చివ్వెంల మండలం గుంజలూరులో స్కూల్‌ అసిస్టెంట్‌ కాగా, ధనలక్ష్మి పెన్‌పహాడ్‌ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. 20 ఏళ్లుగా సూర్యాపేటలోనే ఉంటున్న నరేంద్రబాబు పదేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధుల నుంచి తక్కువ వడ్డీకి డబ్బు తీసుకొచ్చి వాటితో స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసేవారు.

*వాగులో చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతు కాగా అతడిని గాలించేందుకు వచ్చిన ఇద్దరు డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గల్లంతైన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో గురువారం జరిగింది. నేలకొండపల్లి మండలం చెన్నారంనకు చెందిన పగడాల రంజిత్‌ (25) చేపల వేటకని వెళ్లి.. పాలేరు వాగుపై ఉన్న చెక్‌డ్యామ్‌ వద్ద నీటిలో దిగాడు. వలను లాగేందుకు ప్రయత్నించగా నీటి ఉధృతికి అది చెక్‌డ్యాంపై నుంచి అలుగు కిందకు జారింది. దీంతో పాటు రంజిత్‌ కూడా చెక్‌డ్యాం దిగువభాగంలో పడిపోయాడు. అతడిని గాలించేందుకు ఖమ్మం నుంచి నలుగురు సభ్యుల డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపారు. వీరిలో బాశెట్టి ప్రవీణ్‌ (30), పడిగెల వెంకటేష్‌ (27) సుర్దేపల్లి వాగులోకి దిగేందుకు సిద్ధమయ్యారు. తొలుత ప్రవీణ్‌ కాలికి తాడు కట్టి నీటిలోకి దించారు. అతడు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో వెంకటేష్‌ అదే తాడును లాగుతూ నీటిలోకి దిగాడు. కానీ నీటి ప్రవాహానికి వెంకటేష్‌ కొట్టుకుపోయాడు. అతడి మృతదేహం లభ్యమైంది. రంజిత్‌, ప్రవీణ్‌ కోసం గాలిస్తున్నారు.

*మేడ్చల్: జిల్లాలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బ్యూటిషన్‌పై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి స్నేహితుల ద్వారా సంజీవరెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. స్టూడియో పెట్టిస్తానని నమ్మించి పలుమార్లు బ్యూటిసియన్‌పై సంజీవరెడ్డి అత్యాచారం చేశారు. బుధవారం యువతి పుట్టినరోజు కావడంతో ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పగా వారు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*హైదరాబాద్: నగరంలోని నాచారంలో ఆర్టీసీ బస్సు (RTC bus)కు పెను ప్రమాదం తప్పింది. ఈసీఐఎల్ నుంచి అప్జల్‌గంజ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద అకస్మాత్తుగా భారీ వృక్షం (Heavy tree) కూలింది. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకుని పోలీసులు వృక్షాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

*ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) మంజీరా హాస్టల్ మెస్‌లో వంట పని చేస్తున్న కవిత(45) కాంట్రాక్టు వర్కర్ పాముకాటు (snakebite)తో మృతి చెందింది. నిన్న విధి నిర్వహణలో ఓయూ మంజీరా హాస్టల్ మెస్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాముకాటుతో అస్వస్థతకు గురైన కవితను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ కవిత మరణించింది. ఓయూ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్షమే తన భార్య మృతికి కారణమని కవిత భర్త ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత 20 సంవత్సరాలుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కవితకు న్యాయం చేయాలని తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

*యమునా నదిలో పడవ మునిగిన ఘటనలో 20మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బందా నుంచి ఫతేపూర్‌ వెళ్తున్న పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో పడవలో 40మంది ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

*రక్షా బంధన్ పండుగ సందర్భంగా విషాద ఘటన జరిగింది. రాఖీలు కట్టేందుకు వెళ్లి వస్తున్న వారు రోడ్డు ప్రమాదంలో మృత్యువు పాలయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఆనంద్ జిల్లా సోజిత్రా తహసీల్ పరిధిలోని దాలీ గ్రామంలో వేగంగా వస్తున్న కారు ఆటోరిక్షా, మోటారుబైక్‌లను ఢీకొట్టింది.