Devotional

ఇంద్రకీలాద్రిపై వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు- TNI ఆధ్యాత్మిక వార్తలు

ఇంద్రకీలాద్రిపై వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు- TNI  ఆధ్యాత్మిక వార్తలు

శ్రావణ మాసం నాల్గవ శుక్రవారం సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అమ్మవారి మహామండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ముత్తయిదలు పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు.దుర్గగుడి ఈవో బ్రమరాంబ మాట్లాడుతూ అమ్మవారి చెంత వరలక్ష్మి దేవి వ్రతాలకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. దాదాపు 500 మందికి పైగా మహిళా ‌భక్తులు వ్రతం నిర్వహించారని వెల్లడించారు.

1.ప్రతి ఆలయం,ఇంట్లో గోపూజ జరగాలన్నదే లక్ష్యం : టీటీడీ చైర్మన్
గోకులాష్టమి రోజునే కాకుండా రోజూ ప్రతి ఆలయం, ప్రతిఇంట్లో గోపూజ జరగాలన్నదే టీటీడీ లక్ష్యమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. గోపూజ నిర్వహించే ఆలయాలకు ఆర్థిక వనరులు లేకపోతే వాటికి తోడ్పాటు అందించే ఆలోచన కూడా చేస్తామని ఆయన చెప్పారు. గోకులాష్టమి సందర్భంగా శుక్రవారం టీటీడీ గోసంరక్షణ శాలలో గోకులాష్టమి – గోపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వామి వారి ఆశీస్సులతో బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 200 ఆలయాలకు గోవులు, దూడలను దానంగా ఇచ్చామన్నారు. ఇంకా ఆలయాలు, మఠాలు ముందుకు వస్తే గోమాత దూడను ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. గో పూజ విశిష్టతను క్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో అలిపిరి వద్ద సప్తగో ప్రదక్షణ మందిరాన్ని నిర్మించి నట్లు ఆయన తెలిపారు. గో ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తూ, రైతులకు ఆవులు, ఎద్దులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.గో ఆధారిత వ్యవసాయంతో పండిస్తున్న పంటలను రైతుల నుంచి టీటీడీనే కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. అనంతరం చైర్మన్‌ గోసంరక్షణ శాలలో నిర్వహిస్తున్న వేంకటేశ్వర దివ్య మహా మంత్ర యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు అలిపిరి వద్ద నిర్మించిన సప్త గో ప్రదక్షణ మందిరంలో వైవి సుబ్బారెడ్డి గోపూజలో పాల్గొన్నారు. వేణుగోపాల స్వామివారి పూజలో పాల్గొని గోమాతలకు దాణా, మేత, పండ్లు అందించారు.

2. 20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు
యాదాద్రీశుని అనుబంధ ఆలయమైన యాదగిరిగుట్ట శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు శ్రీ కృష్ణాష్టమి కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు.ఈనెల 22న (సోమవారం) శ్రీకృష్ణ జయంతి సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 4.30 గంటలకు ఉట్లు కోట్టే కార్యక్రమం (శిఖ్యోత్సవము) నిర్వహిస్తామన్నారు. అదేరోజు రాత్రి 7.45 గంటలకు రుక్మిణి కల్యాణోత్సవం నిర్వహిస్తాని తెలిపారు. కణ్ణన్ తిరునక్షత్రం సందర్భంగా శనివారం నాటి నిత్య కల్యాణం, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, భోగములు రద్దు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

3. తిరుమలలోని శ్రీవారిని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికా రులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలనంతరం వేదపండితులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో నిర్మాణం లో ఉన్న కర్ణాటక భవనాన్ని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారావు తో కలిసి పరిశీలించారు.2020 సంవత్సరంలో కర్ణాటక భవనానికి శంకుస్థాపన చేయగా భవన నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తామని చైర్మన్‌ వివరించారు. ఈ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల భవన నిర్మాణం ఆలస్యమైందని, ఐదు నెలల్లో కల్యాణ మండపం, మొదటి భవనాన్ని పూర్తి చేస్తామని సీఎంకు వెల్లడించారు.

4. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 70,674 మంది భక్తులు దర్శించుకోగా 35,930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.53 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.సెప్టెంబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను ఈనెల 22న ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. అయితే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించే 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంగప్రదక్షిణం టోకెన్లను రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అంగ ప్రదక్షిణం టోకెన్లను ఆన్‌లైన్లో బుక్ చేసుకోవాలని సూచించింది.

5. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాతం, అభిషేక సేవలో పాల్గొన్నారు. సీజేఐతోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ కూడా శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి శేశ వస్త్రాన్ని బహూకరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

6. తిరుమలలోని శ్రీవారిని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికా రులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలనంతరం వేదపండితులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో నిర్మాణం లో ఉన్న కర్ణాటక భవనాన్ని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారావు తో కలిసి పరిశీలించారు.2020 సంవత్సరంలో కర్ణాటక భవనానికి శంకుస్థాపన చేయగా భవన నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తామని చైర్మన్‌ వివరించారు. ఈ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల భవన నిర్మాణం ఆలస్యమైందని, ఐదు నెలల్లో కల్యాణ మండపం, మొదటి భవనాన్ని పూర్తి చేస్తామని సీఎంకు వెల్లడించారు.

7. భాగ్యనగరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బంజారాహిల్స్ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్‌ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ నామస్మరణతో ఇస్కాన్ ఆలయాలు మారుమోగుతున్నాయి. బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి

8. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాతం, అభిషేక సేవలో పాల్గొన్నారు. సీజేఐతోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ కూడా శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి శేశ వస్త్రాన్ని బహూకరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

9. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న రాఘవేంద్ర రావు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు అన్ని శుభాలే జరగాలని ఆకాంక్షించారు. యాదాద్రి దేవస్థానాన్ని ముఖ్యమంత్రి మహాద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు.