Movies

కండక్టర్‌ ఝాన్సీకి సంపూర్నేష్ బాబు నుండి పిలుపు..

కండక్టర్‌ ఝాన్సీకి సంపూర్నేష్ బాబు నుండి పిలుపు..

శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బండి డాన్స్ పర్ఫామెన్స్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారి పోయిన గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్ ఝాన్సీ జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. ఆమెకు ఇప్పుడు ఏకంగా సినిమాలో ఆఫర్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమెకు ఐటం సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. సంపూ స్వయంగా ఆమెకి ఫోన్ చేసి తన సినిమాలో ఐటెం సాంగ్ చేయాలంటూ అడిగాడు అనే వార్తలు వస్తున్నాయి.

సంపూ ఆఫర్ కి కండక్టర్ ఝాన్సీ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా ఇంటర్వ్యూ లతో సోషల్ మీడియాని కుదిపేస్తున్న కండక్టర్ ఝాన్సీ అతి త్వరలోనే వెండి తెరపై ఐటం సాంగ్ తో రచ్చ చేయడం ఖాయం. ఆ ఐటెం సాంగ్ సక్సెస్ అయితే ఆమె జోరు మరింతగా పెరగడం ఖాయమంటూ బుల్లి తెర వర్గాల వారు మరియు వెండి వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.