Devotional

TNI నేటి తిరుమల సమాచారం

TNI నేటి తిరుమల సమాచారం

టిటిడి నిర్ణయం: శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ ద‌ర్శనాలను టిటిడి రద్దు చేసింది.అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టిటిడి వెల్లడించింది.
తిరుమల పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారికి శ్రీవారి ఆలయం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందచేసిన TTD చైర్మన్ శ్రీ YV. సుబ్బారెడ్డి
4

అన్న ప్రసాదం ట్రస్టుకు రూ లక్ష 10 వేలు విరాళం

తిరుమల అన్నప్రసాదం ట్రస్టు కు ప్రకాశం జిల్లా అనగర్ల పూడికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు శ్రీ CP.వెంకటేష్ రూ 1.10 లక్షల విరాళం అందించారు. తిరుమలలో గురువారం TTD చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు చెక్కు అందించారు.
హైదరాబాదులో స్థిరపడిన శ్రీ వెంకటేష్ తెలంగాణ రాష్ట్రం తరపున అండర్ 19 మ్యాచ్ ఆడారు. ఇందుకు గాను బీసీసీఐ అతనికి రూ 1.10 లక్షల పారితోషికం అందించింది. తన మొదటి చెక్కును తిరుమల స్వామి వారికి విరాళంగా అందివ్వాలనే ఉద్దేశ్యంతో తన తండ్రి శ్రీ విజయ్ తో కలసి చెక్కు ను చైర్మన్ శ్రీ YV.సుబ్బారెడ్డి కి అందించారు.
5
bp garage opening hours