Movies

అలాంటి వ్యక్తి దొరకలేదు

Auto Draft

ఇప్పట్లో పెండ్లి చేసుకునే ఆలోచన లేదని, వివాహం చేసుకుంటేనే సంతోషంగా ఉండాలనేం లేదని చెబుతున్నది తమిళ తార ఆండ్రియా జెర్మియా. ‘విశ్వరూపం’ సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన ఈ నాయిక…టాలీవుడ్‌లో ‘తఢాఖా’ అనే చిత్రంలోనూ నటించింది. కోలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటిస్తున్న ఈ తార పెండ్లి విషయంలో తన దృక్పథాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆండ్రియా జెర్మియా మాట్లాడుతూ…‘20 ఏండ్ల వయసునప్పుడు నాకో పెండ్లి సంబంధం వచ్చింది. కుటుంబంలో అనేక సమస్యలు మొదలై ఆ సంబంధం కుదరలేదు. ఇక అప్పటి నుంచి వివాహం మీదకు నా ఆలోచనలు వెళ్లలేదు. నిజం చెప్పాలంటే నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరకలేదు. అలాంటి తోడు దొరికేదాకా వేచి చూస్తా. వివాహం చేసుకుంటేనే ఆనందంగా ఉంటామని చెప్పలేం. పెండ్లికి, సంతోషానికి ముడి పెట్టకూడదు.’ అని చెప్పింది. ఇటీవల ఫ్లేవర్స్‌ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేసి సంగీత రంగంలో తన ప్రజ్ఞను చాటుకున్న ఆండ్రియా ప్రస్తుతం ‘కా’, ‘పిసాసు 2’, ‘నో ఎంట్రీ’, ‘మాలిగై’ వంటి చిత్రాల్లో నటిస్తున్నది.