Movies

మిమ్మల్ని నిరాశపర్చను

మిమ్మల్ని నిరాశపర్చను

తారలు ఇంటి నుంచి బయట అడుగుపెట్టినది మొదలు అంతటా నటించాల్సి ఉంటుందని చెబుతున్నది అందాల నాయిక పూజా హెగ్డే. ప్రేక్షకులు తమపై పెట్టుకునే అంచనాలే ఇందుకు కారణమని ఆమె అంటున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ…‘ఇంట్లో ఉన్నంత వరకే మాకు స్వేచ్ఛ. బయటకొస్తే ఇతరుల అంచనాలకు తగినట్లు నడుచుకోవాలి. సెలబ్రిటీ లైఫ్‌లో ఇలాంటివి తప్పవు. పూజా ఇలా కనిపించాలి, అలాంటి డ్రెస్‌ వేసుకోవాలి, ఆమె మేకోవర్‌ అలా ఉండాలని అభిమానులు ఊహిస్తుంటారు.ఒక సాధారణ యువతిలా నేను బయటకొస్తే వాళ్లంతా నిరాశపడతారు. వాళ్లను చిన్నబుచ్చడం బాగుండదు. ఇంటికి వెళ్లాక మాత్రం నేను నాలా ఉంటాను. అక్కడున్నంత స్వేచ్ఛ నాకు మరెక్కడా దొరకదు. నటిగా నా వృత్తిపర విషయాలన్నీ బయటే వదిలేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్తా’ అని చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటిస్తున్న పూజా హెగ్డే…ముంబైలో ఇంటిని కొనుగోలు చేసింది. తన హోమ్‌ టూర్‌ వీడియోను పూజా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ఈ వీడియో ఆకట్టుకుంటున్నది.