Business

TNI వాణిజ్యం వార్తలు

TNI వాణిజ్యం వార్తలు

*శంలో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య అక్టోబరు నాటికి 10.4 కోట్లకు చేరింది. గత ఏడాది కన్నా ఇది 41 శాతం అధికం. అయితే గత ఆగస్టు నుంచి కొత్త ఖాతాల సంఖ్య తగ్గుతూ వస్తోందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విశ్లేషణలో తేలింది. కొత్తగా జోడైన డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య ఆగస్టులో 26 లక్షలు కాగా సెప్టెంబరులో 20 లక్షలకు, అక్టోబరులో 18 లక్షలకు పడిపోయింది. ప్రపంచ సంఘటనల వల్ల స్టాక్‌ మార్కెట్లో ఆటుపోట్లు పెరగడం ప్రధాన సూచీలతో పోల్చితే ఇతర సూచీల నిరాశావహ పనితీరు ఇందుకు కారణమని పేర్కొంది.

*కర్ణాటకలోని కుమారస్వామి గనుల్లో ఇనుప ఖనిజం ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే రెండు మూడేళ్లలో రూ.900 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో ఎక్కువ భాగాన్ని బళ్లారి జిల్లాలోని కుమార స్వామి గని విస్తరణ కోసం ఖర్చు చేస్తారు. దీంతో ఈ గని వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం ప్రస్తుత 70 లక్షల టన్నుల నుంచి కోటి టన్నులకు పెరుగుతుంది. ఈ గని ఉత్పత్తి సామర్ధ్య విస్తరణకు ఇటీవలే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ గని ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరించాలని ఎన్‌ఎండీసీ నిర్ణయించింది.

*ఈ వారం డెరివేటివ్స్‌ ముగింపు ఉండటంతో స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లలో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెక్నికల్‌గా చూస్తే మాత్రం మార్కెట్లు అప్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను కనబరిస్తే మాత్రం నిఫ్టీకి 18100-18250 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. అప్‌ట్రెండ్‌ను సూచిస్తే 18450-18500 వద్ద నిరోధ స్థాయిలుంటాయి. మార్కెట్లు పడినప్పుడు ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్స్‌ను తీసుకునే విషయాన్ని పరిశీలించవచ్చు. స్టాక్‌ ఆధారిత విధానాన్ని అనుసరించటం మంచిది.

* టెకీల్లోనే కాకుండా వివిధ రంగాల‌కు చెందిన ఉద్యోగుల‌నూ లేఆఫ్స్ భ‌యం వెంటాడుతోంది. ట్విట్ట‌ర్, మెటా, అమెజాన్ స‌హా ప‌లు దిగ్గజ టెక్ కంపెనీలు ఇటీవ‌ల ఉద్యోగుల‌పై వేటు వేస్తుండ‌గా తాజాగా ఫుడ్ డెలివ‌రీ యాప్ జొమాటో సైతం లేఆఫ్స్ ప్ర‌క‌టించింది. కంపెనీ నుంచి వైదొల‌గాల‌ని ప‌లు విభాగాల‌కు చెందిన ఉద్యోగుల‌ను జొమాటో కోరింది.

*దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 207 పాయింట్ల పతనంతో 61,456 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 18,246 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. బ్యాంక్ నిఫ్టీలో 150 పాయింట్ల పతనంతో 42,286 పాయింట్ల స్థాయిలో ట్రేడింగ్ ప్రారంభమైంది. టేడ్రింగ్‌ మొదలై నుంచే మార్కెట్లలో ఒత్తిడి కనిపిస్తున్నది. దీనికి తోడు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 95 పాయింట్లు పడిపోయి, ప్రస్తుతం 18250 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. డౌ ఫ్యూచర్స్ సైతం ఒత్తిడిలోనే ఉన్నాయి. దాదాపు 100 పాయింట్ల మేర పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 486 పాయింట్లు తగ్గి 61,179 పాయింట్లు, నిఫ్టీ 145 పడిపోయి 18,161 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ముడిచమురు ధర బలహీనంగా ఉన్నది.