Politics

పారిశ్రామికవేత్తల ఆస్తులను లాక్కుంటున్న జగన్.

పారిశ్రామికవేత్తల ఆస్తులను లాక్కుంటున్న జగన్.

శ్రీ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ గారి విలేకరుల సమావేశం వివరాలు : (16.12.2022)

పారిశ్రామికవేత్తల మెడపై కత్తిపెట్టి వారిఆస్తుల్ని, సంస్థల్ని లాక్కుంటున్న జగన్ రెడ్డి, అమూల్ సంస్థకోసమే రాష్ట్ర సహకారడెయిరీలను కబళిస్తున్నాడు.

• 4.50లక్షలమంది మహిళారైతులు సభ్యులుగాఉన్న శ్రీజడెయిరీని మంత్రిపెద్దిరెడ్డి చెరబట్టినప్పుడు జగన్ రెడ్డి ఏంచేశాడు?
• మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలో అమూల్ సంస్థకోసం పాలుసేకరించే సత్తా, దమ్ము అప్పలరాజుకి, జగన్ రెడ్డికి ఉన్నాయా?
• సహకార డెయిరీ హస్తగతానికే జగన్ అమూల్ ను తెరపైకి తెచ్చాడు. వ్యక్తిగత ప్రయోజనాలకోసం, సంగండెయిరీని హస్తగతం చేసుకోవడానికే నాపై తప్పుడుకేసులు పెట్టాడు. .
• ఒంగోలు డెయిరీ నష్టాలతో మూతపడేపరిస్థితుల్లో ఉంటే, చంద్రబాబుగారు రూ.35కోట్లు ఇచ్చి దాన్ని ఆదుకుంది నిజంకాదా?
• సొంతరాష్ట్రంలోని సహకారడెయిరీలను మూసేస్తున్న జగన్ రెడ్డికి, గుజరాత్ సంస్థ అమూల్ పై ఎందుకంత ప్రేమ?
• తనపై ఉన్న కేసులమాఫీకోసమా..లేక కమీషన్ల కక్కుర్తికోసమా, ఇతర రహస్య లావాదేవీల కోసమా?
శ్రీ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ (మాజీఎమ్మెల్యే)

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, రాష్ట్రపారిశ్రామికరంగం పూర్తిగా కుదేలైందని, పారిశ్రామికవేత్తల మెడపై కత్తిపెట్టి వారిసంస్థల్ని, ఆస్తుల్ని లాక్కుంటున్న వైసీపీప్రభుత్వం, ఆ కోవలోనే అమూల్ సంస్థకోసం రాష్ట్రంలోని సహకారడెయిరీలను కబళించడానికి సిద్ధమైం దని టీడీపీ సీనియర్ నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పష్టంచేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!

“జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పారిశ్రామికరంగంపై విషసంస్కృతి మొదలైంది. పాలకులు పారిశ్రామికవేత్తల మెడపై కత్తిపెట్టి, వారిఆస్తులు, వ్యాపారాలు లాక్కుంటున్నారు. తమకునచ్చినవారికి మేలుచేయడానికి, ప్రజలప్రయోజనాల్ని కాలరాస్తున్నారు. గంగవరంపోర్టులో రాష్ట్రప్రభుత్వానికి ఉన్న వాటాను అతితక్కువధరకు అమ్మిన వైసీపీప్రభుత్వం, కాకినాడ పోర్టుని, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుని అరబిందో కంపెనీకి కట్టబెట్టింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తనకు నచ్చినవారికి మేలుచేయడానికే జగన్ రెడ్డి ఉపయోగిస్తున్నాడు.
సంగండెయిరీని లాక్కోవడం అప్పలరాజు తరంకాదు…
మంత్రి అప్పలరాజు సంగం డెయిరీమెడపై కత్తిపెట్టి, అధికారబలంతో దాన్నిలాక్కోవచ్చు అనుకుంటున్నాడు. ఆయనకాదు.. ఆయన తాతలు దిగివచ్చినా సంగండెయిరీని లాక్కోలేరు. సంగం డెయిరీని అంగుళంకూడా కదిలించలేరు. సంగం డెయిరీని కాపాడుకునే సత్తా, సమర్థత పాడిరైతులకు ఉన్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజు భాష, ప్రవర్తన చూస్తే, పశులుకూడా ఆయన్ని తన్నేలా ఉన్నాయి. తన నియోజకవర్గంలోని కొండలు, గుట్టలు ఎందుకు మాయమవుతున్నాయో అప్పలరాజు చెప్పాలి. వైద్యుడైన అప్పలరాజు తనప్రాంతంలోని కిడ్నీబాధితులకు మెరుగైనవైద్యాన్ని ప్రభుత్వపరంగా ఎందుకు అందించ లేకపోతున్నారు? టీడీపీప్రభుత్వం ఏర్పాటుచేసిన డయాలసిస్ కేంద్రాలు ఎందుకు నిర్వహిం చలేకపోతున్నాడు? మంత్రి అప్పలరాజు అవినీతి బాగోతంపై నక్సలైట్లు రెండుసార్లు లేఖలు రాశారు. వైసీపీప్రభుత్వంలో లక్షపశువులు చనిపోతే, నష్టపరిహారంగా ఎందరు పాడిరైతుల్ని ఆదుకున్నారో పశువులమంత్రి అప్పలరాజు చెప్పగలడా? పశునష్టపథకం కింద పాడిరైతులకు ఇవ్వాల్సిన రూ.250కోట్లు ప్రభుత్వం, ఎందుకు ఇవ్వడంలేదో అప్పలరాజు చెప్పాలి? కమీషన్లకోసం పశువులదాణాకు సంబంధించిన టెండర్ ని ఫర్టైల్ గ్రీన్ అనే సంస్థకు కట్టబెట్టింది జగన్ ప్రభుత్వంకాదా మంత్రివర్యా? రాష్ట్రంలో పశువులదాణా సరఫరా మొత్తం వైసీపీఎమ్మెల్యేకి చెందిన వల్లభఫీడ్స్ కు అప్పగించింది నిజంకాదా? వైసీపీప్రభుత్వం సబ్సిడీపై ఏ ఒక్క ఎస్సీ,ఎస్టీ, బీసీ రైతుకైనా పశువులు అందించిందా? సంచార పశువైద్యశాలలు ఏపీప్రభుత్వంకంటే ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎప్పుడో అమలు చేశాయని మంత్రి అప్పలరాజు తెలుసుకోవాలి.

సహకారడెయిరీల నాశనానికి జగన్, రాజశేఖర్ రెడ్డి కంకణం కట్టుకున్నారని అప్పలరాజు గ్రహించాలి…
సహకారరంగంలో సమూలమార్పులు తీసుకురావడానికి, ప్రభుత్వపెత్తనాన్ని తగ్గించడానికే స్వర్గీయ ఎన్టీఆర్ గారు మ్యాక్స్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని సహకార డెయిరీలన్నింటినీ అదేచట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. కరీంనగర్ డెయిరీ, నల్గొండ-రంగారెడ్డి డెయిరీ, విశాఖ డెయిరీ, సంగండెయిరీ, కృష్ణా ఒంగోలు డెయిరీలు, కర్నూల్లో ఉన్న విజయడెయిరీలు నాటి ప్రభుత్వాల ప్రోత్సాహంతో సదరు చట్టంపరిధిలోకి వెళ్లాయనే వాస్తవాన్ని మంత్రి అప్పలరాజు గ్రహించాలి. డెయిరీరంగం మ్యాక్స్ చట్టంలోఉండబట్టే, సహకారరంగంలోని వ్యవస్థలన్నీ కుప్పకూలినా అది నేటికీ అజరామరంగా నిలబడింది.జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డికూడా మ్యాక్స్ చట్టాన్ని ఎమెండ్ చేసి, ఉమ్మడి రాష్ట్రంలోని డెయిరీలన్నీ ప్రభుత్వఅధీనంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి నిర్ణయంపై డెయిరీల యాజమాన్యాలు సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడితే, అత్యున్నత న్యాయస్థానం పాడిరైతులకు అండగా నిలిచింది.

సహకార డెయిరీల హస్తగతానికే జగన్ అమూల్ ను తెరపైకి తెచ్చి, వ్యక్తిగత ప్రయోజనాలకోసం నాపై తప్పుడుకేసులు పెట్టాడు.
రాష్ట్రసహకార డెయిరీలను హస్తగతం చేసుకోవడానికే జగన్ రెడ్డి అమూల్ సంస్థను తెరపైకి తెచ్చాడు. సంగం డెయిరీ అనేది మ్యాక్స్ చట్టంలోకి మారినప్పుడు దాని ఛైర్మన్ గా ఎవరున్నారో వైసీపీప్రభుత్వం తెలుసుకోవాలి. సంగం డెయిరీ జనరల్ బాడీ ట్రస్ట్ కోసం 10ఎకరాల భూమిని కేటాయించి, సదరు భూమిని 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా డెయిరీ ఛైర్మన్ గా ధూళిపాళ్ల నరేంద్ర లేడు. కేవలంరాజకీయ ప్రయోజనాల్లో భాగంగానే నాపై తప్పుడుకేసులు పెట్టారు. సంగం డెయిరీని ఎవరైతే మ్యాక్స్ చట్టంలోకి తీసుకొచ్చారో, భూమి ఎవరి హయాంలో ట్రస్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందో, వారిపై ఈప్రభుత్వం ఎందుకు కేసుపెట్టలేదని ప్రశ్నిస్తున్నాను. జగన్ ప్రభుత్వం ఏసీబీ కేసులతో తనపై బురదజల్లాలని చూస్తోందని తేలిపోయింది. గుజరాత్ లోని మిల్క్ యూనియన్ల సహాకారంతో ఏర్పడిన వ్యవస్థ అయిన అమూల్ పాడిరైతులకు ఎలా బోనస్ ఇస్తుందో మంత్రి చెప్పాలి? పాడిరైతులకు వందలకోట్ల బోనస్ లు ఇస్తున్న రాష్ట్ర సహకార డెయిరీలు మంత్రికి , ముఖ్యమంత్రికి పనికిరాకుండా పోయాయి.
ఒంగోలు డెయిరీని చంద్రబాబు బతికిస్తే, జగన్ వచ్చాక దానితోపాటు, చిత్తూరు, నంద్యాల, నెల్లూరు విజయడెయిరీలను అమూల్ కోసం నాశనంచేశాడు…
ఒంగోలు డెయిరీ నష్టాలతో మూతపడేపరిస్థితుల్లో ఉంటే, చంద్రబాబుగారు రూ.35కోట్లు ఇచ్చి దాన్ని ఆదుకుంది నిజంకాదా? అలానే మదనపల్లెలో ఫెడరేషన్ కిందఉన్న ప్రభుత్వడెయిరీకి రూ.15కోట్లు వెచ్చించింది టీడీపీప్రభుత్వం కాదా? 20వేల లీటర్ల పాలు సేకరిస్తున్న ఒంగోలు డెయిరీ అర్థంతరంగా మూతపడటానికి జగన్ రెడ్డి కారణం కాదా? విలువైన ఒంగోలు డెయిరీ ఆస్తులపై కన్నేసిన జగన్, అదిమూతపడేందుకు కుట్రలు చేశాడు. నెల్లూరుజిల్లాలోని విజయడెయిరీ 2, 3నెలలుగా రైతులకుబకాయిలు, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంటే జగన్ రెడ్డి ఏంచేశాడు? నెల్లూరు విజయడెయిరీని ఆదుకోవడానికి వైసీపీప్రభుత్వం ఎందుకు ముందుకురాలేదో ముఖ్యమంత్రి చెప్పాలి. నంద్యాలడెయిరీ పాలకవర్గాన్నితనగుప్పిట్లో ఉంచుకున్న జగన్, దాన్ని నిలబెట్టడానికి అవసరమైన రూ.15వేలకోట్ల సాయం ఎందుకు చేయలేకపోయారు? నంద్యాల డెయిరీని అమూల్ సంస్థకు అప్పగిస్తే, డబ్బులిస్తామని జగన్ బేరాలు ఆడింది నిజంకాదా? రాయలసీమలో ఉన్న ఒక్కసహకార డెయిరీని నిలబెట్టి, దానికి అవసరమైన డబ్బులు ముఖ్యమంత్రిద్వారా ఇప్పించే ధైర్యం వైసీపీనేతలకు ఉందా అని ప్రశ్నిస్తున్నాం.

రాష్ట్రంలోని సహకారడెయిరీలకు పైసా సాయంచేయని జగన్, అమూల్ సంస్థకు రూ.3వేలకోట్ల ప్రజలసొమ్ముదోచిపెట్టాడు.
రాష్ట్రంలోని సహకార డెయిరీలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రికి మనసురాదుకానీ, అమూల్ కోసం రూ.3వేలకోట్లు వివిధగ్రాంట్ల రూపంలో కేటాయించడానికి వస్తుంది. అవిచాలవన్నట్లు అవసరమైతే ఎన్ సీడీఎఫ్ నుంచి అమూల్ సంస్థకు మరో రూ.1200కోట్లు ఇప్పించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇదంతా ఎవడబ్బసొమ్మని జగన్ రెడ్డి ఈ విధంగా అమూల్ కు దోచిపెడుతున్నాడు? వేలకోట్ల విలువైన సహకారడెయిరీల ఆస్తుల్ని నామినల్ ధరకే జగన్ ప్రభుత్వం అమూల్ సంస్థకు ఎందుకు కట్టబెడుతోంది? మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తామని రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి ఇద్దరూ ఎన్నికలసమయంలో హామీలిచ్చారు. చిత్తూరు డెయిరీని తెరిపించకపోగా జగన్ రెడ్డి దానికి చెందిన రూ.600కోట్ల ఆస్తుల్నిసంవత్సరానికి కోటిరూపాయల నామమాత్రపు ధరకు 99ఏళ్లకు అమూల్ కు కట్టబెట్టాడు. జగన్ ప్రభుత్వం వేసిన హౌస్ కమిటీనే, చిత్తూరుడెయిరీ ఎందుకు మూతపడిందో స్పష్టంగా చెప్పింది. అమూల్ కోసం వేలకోట్లప్రజలసొమ్ము ఖర్చుపెడుతు న్న ముఖ్యమంత్రి సహకారడెయిరీలైన ఒంగోలు, చిత్తూరుడెయిరీలను ఎందుకు పున రుద్ధరించలేదు? సొంతరాష్ట్రంలోని డెయిరీలను మూసేస్తున్న జగన్ రెడ్డికి, గుజరాత్ సంస్థ అమూల్ పై ఎందుకంత ప్రేమని ప్రశ్నిస్తున్నాం. తనపై ఉన్న కేసులమాఫీకోసమా..లేక కమీషన్ల కక్కుర్తికోసమా, లేకఇతర రహస్య లావాదేవీల కోసమా అన్నది ఆయనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్కప్రైవేట్ డెయిరీ వచ్చిందిలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దొడ్ల, జెర్సీ, హెరిటేజ్ వంటి ఎన్నోప్రైవేట్ డెయిరీలు ఏర్పడ్డాయి.

4.50లక్షలమంది మహిళారైతులు సభ్యులుగాఉన్న శ్రీజడెయిరీని మంత్రిపెద్దిరెడ్డి చెరబట్టినప్పుడు జగన్ రెడ్డి ఏంచేశాడు?
అత్యధికమంది మహిళారైతులున్న చిత్తూరు శ్రీజ డెయిరీ ప్రపంచంలోనే అత్యధికమహిళాసభ్యులున్న పాలడెయిరీగా గుర్తింపు పొందింది. 4.50లక్షలమంది మహిళారైతులు శ్రీజ డెయిరీలో భాగస్వాములుగా ఉన్నారు. గ్రామాల్లోని మహిళా సమాఖ్యల నిర్వహణలో కొనసాగుతూ, రూ.900కోట్ల టర్నోవర్ చేస్తున్న అలాంటి డెయిరీ ప్రగతి జగన్మోహన్ రెడ్డికి కనిపించకపోవడం సిగ్గుచేటు. శ్రీజ డెయిరీకి చెందిన సోమలాసదుం ప్రాంతంలోని బల్క్ మిల్క్ కూలర్లను మంత్రి పెద్దిరెడ్డి మూసేయించింది నిజంకాదా? శ్రీజ డెయిరీ సిబ్బందిని మంత్రి నిర్బంధిస్తే, ఈ ప్రభుత్వం ఎందుకు నోరెత్తలేదు? మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలో అమూల్ సంస్థకోసం పాలుసేకరించే సత్తా, దమ్ము అప్పలరాజుకి, జగన్ రెడ్డికి ఉన్నాయా? పాడిరైతుల అసలైన దోపిడీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలోనే జరుగుతోం దని ముఖ్యమంత్రికి తెలియదా? మిగతా డెయిరీలు ఇచ్చేదానికంటే లీటర్ పాలకు రూ.15తక్కువ ఇస్తూ మంత్రి పెద్దిరెడ్డి పాడిరైతుల్ని దోచుకుంటుంది వాస్తవంకాదా? రాష్ట్రంలోని సహకార డెయిరీలు, వాటియాజమాన్యాలు మంత్రి చీదర అప్పలరాజుకి చీదరగా ఎందుకు కనిపిస్తున్నాయి. రైతులకోసం పనిచేసే సహకారడెయిరీలు, వాటి యాజమాన్యాలు మాత్రమే ఈ ప్రభుత్వానికి దోపిడీదారుల్లా ఎందుకు కనిపిస్తున్నాయి.. పెద్దిరెడ్డి ఇలాఖాలో రైతుల్ని బెదిరించేది దోపిడీ కాదా?
సంచారపశు వైద్యశాలలపేరుతో వేలకోట్ల ప్రజలసొమ్ముని దోచుకుంటున్నారు. సంచార పశువైద్యశాలల్లో సరిపడామందులు, సిబ్బంది లేరు. మూడున్నరేళ్లలో వైసీపీప్రభుత్వం ఒక్క పశువైద్యుడిని అయినా నియమించిందా? గోపాలమిత్రలకు గౌరవభృతి పెంచారా అంటే అదీలేదు. రాష్ట్రీయకృషియోజన, ఎన్.ఎల్.ఎమ్ వంటి కేంద్రపథకాల సొమ్ముని కూడా పాడిరైతులకు దక్కుకుండా వైసీపీనేతలే తినేస్తున్నారు. ఈ వాస్తవాలను, తనశాఖలో జరిగే వ్యవహారాలను మంత్రి అప్పలరాజు తెలుసుకుంటే మంచిది. అప్పలరాజు గురివిందగింజలా మాట్లాడటం సిగ్గుచేటు. సంగండెయిరీకి ఎన్ డీడీబీ ఇచ్చిన రుణాలన్నీ తిరిగి చెల్లిస్తున్నాం. ప్రభుత్వం సంగండెయిరీకి ఎప్పుడూ ఒక్కరూపాయి సాయంచేసింది లేదు. జగన్ రెడ్డి మెప్పు, ప్రాపకంకోసం తప్పులుచేస్తున్న అధికారులంతా ఏదోఒకనాడు శిక్షకు గురికాకతప్పదు” అని నరేంద్ర హెచ్చరించారు.