Editorials

అందాల నటుడు శోభన్ బాబు వర్ధంతి నేడు.. ప్రత్యేక కథనం..

అందాల నటుడు శోభన్ బాబు వర్ధంతి నేడు.. ప్రత్యేక కథనం..

శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 – మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. 
🌷వర్ధంతి🌷


అందమే శోభనమై
పుట్టిందేమో!
________

అందానికి పురుషరూపం..
నటనకు విశ్వరూపం..
మనిషేమో గ్లామర్
మనసేమో గ్రామర్…
ఏయెన్నార్..ఎన్టీఆర్
మహావిన్యాసాల పద్మవ్యూహంలో
దూసుకొచ్చిన వీరాభిమన్యు..
మహిళాలోకం వీరాభిమాన్
తెలుగు సినిమా హీమాన్!

అటూ ఇటూ హీరోయిన్లు..
నడుమ రేగిపోయే సోగ్గాడు..
శారద మెచ్చిన మానవుడు
మంచివాడైన దానవుడు
ఒకనాటి లవర్ బాయ్..
ఈ మంచిబాబాయ్
జన హృదయాల్లో ఖైదీబాబాయ్..!

బాపూ సంపూర్ణరామాయణం లో
అందాలరాముడు..
అదే బాపు బుద్ధిమంతుడు లో
అప్పుడప్పుడు
అక్కినేనికి మాత్రమే
కనిపించే కృష్ణుడు..
కురుక్షేత్రం లో మాత్రం
బొచ్చు కృష్ణుడు..
తెలుగింటి అందాల నటుడు..
ఈ నటభూషణుడు
మిత భాషణుడు..!

ఎంతగా వివాదాలకు దూరమైనా
జయ పజయాలు
లలితం గా ఆయన
జీవితంలో ప్రధాన భాగాలు..
నట జీవితం..నిజ జీవితం
ఆయన మనసులో
విడిభాగాలు..
ఈ రెండూ శోభన్ దృష్టిలో
సమాంతర రేఖలు..
వాటిని వేరుగా ఉంచే
లాగించేశారు సినీ ప్రస్థానం
కొట్టేశారు అగ్రహీరోగా
సుస్థిర స్థానం..!

అందానికి నిర్వచనం
ఈ శోభనాద్రి..
ఇంటి పేరు ఉప్పు..
మనిషేమో నిప్పు..
సొగసుగా అమరే మేకప్పు..
నుదుటిపై ఆ రింగు
ఆయనకే ఒప్పు..
పని విలువ ఎరిగిన శ్రామికుడు
భూమి విలువ
తెలిసిన దార్శనికుడు..
అందమైన నాయికల ప్రేమికుడు..
ఈ శోభన్ బాబు మహిళాలోకం
మెచ్చిన కథానాయకుడు..!

తన అందంపై
అలవిమీరిన మక్కువ
రూపం మారినంతనే
తనకు తానే అయి లోకువ
ఈ తెరవేలుపు
తీసేసుకుని ఓ మలుపు
చెప్పేసి సినిమాలకు సెలవు
నాటి నుంచి మదరాసులోనే బ్రతుకుతెరువు..
ఇక ఏవండీ ఆవిడొచ్చింది
అనిపించుకోక ఇల్లాలి తోడిదే ప్ర”శాంత”నెలవు..
పిల్లల బొమ్మల కొలువు..
తోటి నటులంతా భాగ్యనగరికి
మార్చినా మకాం
చెన్నపట్నమే శోభన్
శాశ్వత డాట్ కాం..
పేరుకు ముందు డీసెన్సీ
చివర బీఎస్సీ…
క్రమం తప్పని క్రమశిక్షణే
శోభన్ బాబు లెగసీ..!