NRI-NRT

భారత నిరుద్యోగులకు కెనడా శుభవార్త..

భారత నిరుద్యోగులకు కెనడా శుభవార్త..

భారత్‌తో సహా ఇతర దేశాల గ్రాడ్యుయేట్లకు కెనడా ప్రభుత్వం తీపి కబురు అందించింది.తాజాగా ఈ దేశ ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లను ఏకంగా 1.
5 సంవత్సరాల వరకు పొడిగించుకునే సువర్ణ అవకాశాన్ని అందించింది.ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) ఈ విషయమై ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

దాంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ల (PGWP) గడువు ముగియనున్నవారు ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా ఆ వర్క్ పర్మిట్ల సమయాన్ని పెంచుకోవచ్చు.
తద్వారా కెనడా ( Canada ) దేశంలో ఎక్కువ కాలం ఉండి మరికొంత వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.ఏప్రిల్ 6 నుంచి ఎక్స్‌టెండెడ్ వర్క్ పర్మిట్లను పెంచుకోవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు.ఈ గోల్డెన్ ఆపర్చునిటీని విదేశీ గ్రాడ్యుయేట్లు( Foreign Graduates) సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరారు.

సాధారణంగా పీజీడబ్ల్యూపీ ప్రోగ్రామ్ ద్వారా ఫారిన్ గ్రాడ్యుయేట్స్‌ కెనడాలో వర్క్ పర్మిట్లు పొంది, అక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ సాధించడానికి చాలా హెల్ప్ అవుతుంది.

ఇకపోతే 2022 ఏడాది నాటికి కెనడా దేశంలో కెనడా 2.86 లక్షల మంది ఫారిన్ గ్రాడ్యుయేట్లు వాలీడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లతో అక్కడ నివసిస్తున్నారని గణాంకాలు వెల్లడించాయి.అదే గణాంకాల ప్రకారం, 2.86 లక్షల పోస్ట్ గ్రాడ్యుయేట్లలో 1.27లక్షల పీజీడబ్ల్యూటీల గడువు 2023లో ఎక్స్‌పైర్ కానుంది.ఇక మిగిలిన వారిలో 67 వేల మంది పీజీడబ్ల్యూటీ హోల్డర్లు ఆల్రెడీ పెర్మనెంట్ రెసిడెన్సీ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు.
వీరు వర్క్ పర్మిట్ల గడువు పొడిగింపు కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.