NRI-NRT

ఫిఫా వరల్డ్ కప్ ఖతార్క బాగానే కలిసొచ్చింది.. నెలలు గడుస్తున్న తగ్గని పర్యాటకులు.. బిజినెస్ హబ్ కాస్తా..

ఫిఫా వరల్డ్ కప్ ఖతార్క బాగానే కలిసొచ్చింది.. నెలలు గడుస్తున్న తగ్గని పర్యాటకులు.. బిజినెస్ హబ్ కాస్తా..

గల్ఫ్ దేశం ఖతార్ గతేడాది ఫిఫా ప్రపంచకప్కు (FIFA World Cup) ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.

దోహా: గల్ఫ్ దేశం ఖతార్ గతేడాది ఫిఫా ప్రపంచకప్ కు (FIFA World Cup) ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫుట్బాల్ వరల్డ్కప్ ముగిసి నెలలు గడిచిన ఆ దేశానికి వెళ్లే సందర్శకుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఖాతార్ లోని పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రాంతాలను ప్రతిరోజు భారీ సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్నారట. ప్రధానంగా రాజధాని నగరం దోహాలోని (Doha) అన్ని ఐకానిక్ ప్రదేశాల్లో గతవారం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు కనిపించారని అధికారులు తెలిపారు. సౌక్ వాకిఫ్, మీరెబ్, కార్నిచ్, ది పర్లలోని హాటల్స్, రెస్టారెంట్స్, మాల్స్ అరేబియన్ వంటకాలు, ఇతర కొన్ని స్పెషల్ డిషేసన్ను విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఆస్వాదిస్తున్నారట. ఇక ఇప్పటికే పర్యాటకానికి మంచి పేరు ఉన్న ఖతార్కు.. పిపా ప్రపంచకప్ మరింత ఆకర్షణను తెచ్చి పెట్టింది. దాంతో ఆటోమెటిక్గా పర్యాటకుల ఫేవరేట్ పర్యాటక గమ్యస్థానంగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంతకుముందు బిజినెస్ హబ్ గా ఉన్న ఖతార్ (Qatar).. ఇప్పుడు పర్యాటకంగా కూడా సందర్శకులను ఆకర్షిస్తుండడం శుభాపరిణామం అని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి ఖతార్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దమైనట్లు సమాచారం. అతి త్వరలోనే ప్రపంచ సందర్శకులకు అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయని దోహా బస్ జనరల్ మేనేజర్ తారెక్ అమోరా వెల్లడించారు. ఇక దోహా బస్ అనేది ఖతార్ లోని ప్రముఖ డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది సందర్శకులకు పర్యాటకం, ఆతిథ్యం సర్వీసులను అందిస్తుంది. 2013లో వచ్చిన ఈ సంస్థ.. అనతికాలంలోనే బాగా అభివృద్ధి చెందింది. హాప్ ఆన్ హాప్ ఆఫ్ టూర్ ప్రొవైడర్ ప్రైవేట్ యాజమాన్యంలో ఈ సంస్థ స్థాపించబడింది.