Politics

రాష్ట్రపతి భవన్ సందర్శించిన ఎంపీలు..

రాష్ట్రపతి భవన్ సందర్శించిన ఎంపీలు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యం స్వీకరించిన ఎంపీలు కేశవరావు,నామా, వద్దిరాజు,బండి

న్యూఢిల్లీ : దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి తదితర ఎంపీలు రాష్ట్రపతి భవన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన ఆతిథ్యాన్ని వారు ఇతర ఎంపీలతో కలిసి స్వీకరించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను దశల వారీగా పిలిచి ఆతిథ్యం ఇస్తున్నారు.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఎంపీలు కేశవరావు, నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి,కే.ఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పీ.రాములు,బీ.బీ.పాటిల్,మన్నె శ్రీనివాస్ రెడ్డిలు ఇతర ఎంపీలతో పాటు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శించి ఆమెతో కలిసి అల్పాహారం, తేనీరు తీసుకున్నారు.