NRI-NRT

అమెరికాలో విషాదం: భారత సంతతి చెఫ్ రాఘవన్ అయ్యర్ కన్నుమూత.. క్యాన్సర్ పై పోరాడుతూ చివరికి..

అమెరికాలో విషాదం: భారత సంతతి చెఫ్ రాఘవన్ అయ్యర్ కన్నుమూత.. క్యాన్సర్  పై  పోరాడుతూ చివరికి..

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన ప్రముఖ చెఫ్ రాఘవన్ అయ్యర్( Raghavan Iyer ) కన్నుమూశారు.

ఆయన వయసు 61 సంవత్సరాలు.గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రాఘవన్ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రసారం చేసింది.

ఈయన మరణవార్తతో అమెరికాలోని ప్రవాస భారతీయులు, కోట్లాది మంది అభిమానులు, ఆహారప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు.చెఫ్‌గా, పాకశాస్త్ర ప్రొఫెసర్‌గా, పుస్తక రచయితగా రాఘవన్ అయ్యర్ తన బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు.

ఆయన రాసిన ‘‘660 కర్రీస్’’( 660 Curries ) పుస్తకం ఎంతో ప్రజాదరణ పొందింది.దీనితో పాటు మరో ఏడు పుస్తకాలను రాఘవన్ రాశారు.

కొలొరెక్టల్ క్యాన్సర్‌తో పాటు సంక్లిష్టమైన న్యూమోనియా కారణంగా రాఘవన్ మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్( New York Times ) వెల్లడించింది.అమెరికాలోని మిన్నియాపోలిస్‌లో స్థిరపడిన ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది.

1961, ఏప్రిల్ 21న భారత్‌లోని తమిళనాడు రాష్ట్రం చిదంబరంలో గంగాబాయి రామచంద్రన్, ఎస్ రామచంద్రన్( Gangabai Ramachandran, S Ramachandran ) దంపతులకు రాఘవన్ జన్మించారు.ఆయన తండ్రి భారత నౌకాదళంలో అధికారి కాగా, తల్లి గృహిణి.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రామచంద్రన్ తన కుటుంబాన్ని ముంబైకి తరలించాడు.ఆరుగురు సంతానంలో రాఘవన్ చిన్నవాడు.అతని అక్క లలితా అయ్యర్ ఫేమస్ గైనకాలజిస్ట్.ఈ క్రమంలోనే ఆమె తన తల్లి ప్రసవ సమయంలో సహాయం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

ఇక.ఈ ఏడాది మార్చిలో బీబీసీకి చివరిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆఖరి పుస్తకం ‘‘On the Curry Trail: Chasing the Flavor That Seduced the World’’ గురించి రాఘవన్ ప్రస్తావించారు.ఈ సందర్భంగా భారతీయ వంటకాల( Indian cuisine ) గురించి చెప్పారు.భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా కర్రీలు ఎలా ప్రయాణించాయో ఆయన పేర్కొన్నారు.ఈ పుస్తకాన్ని కూరల ప్రపంచానికి తన ప్రేమ లేఖగా రాఘవన్ అభివర్ణించారు.అయితే అనారోగ్యాన్ని జయించి తిరిగి క్షేమంగా వస్తారనుకున్న వేళ రాఘవన్ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు