NRI-NRT

నేడు చర్చిల్ డే

నేడు చర్చిల్ డే

ఇలాంటి ఓ రోజుందా..
ఇంతటి సత్కారం కలదా..
ఒక బ్రిటిష్ ప్రధానికి అమెరికా తన దేశంలో గౌరవ పౌరసత్వం కల్పించడం..ఆ వేడుకకు సత్కారం అందుకోవాల్సిన నేత రాలేకపోయినా సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హాజరై గౌరవం
వ్యక్తం చేయడం..అరుదైన సన్నివేశం..!
అలాంటి అపురూప ఘట్టం..అరవై సంవత్సరాలకు మునుపు ఇదే రోజున ఆవిష్కారమైంది.
ఒక విదేశీయునికి అమెరికా గొరవ పౌరసత్వం కల్పించడం అదే మొదటిసారి.
ఇంతటి గౌరవాన్ని అందుకున్న చర్చిల్ అప్పటికే చరిత్రలో అసాధారణ వ్యక్తి..
ఆయన ఇంగ్లండ్ ప్రధానిగా వ్యవహరిస్తుండటమే గాక మిలిటరీ స్ధాయిలో కూడా అనన్యసామాన్యమైన అనుభవాన్ని సముపార్జించి ఉన్నారు. అంతే కాదు..అంతకు పది సంవత్సరాలకు పూర్వం..1953 వ సంవత్సరంలోనే
సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని సైతం అందుకున్న ఘనాపాటి.
వీటన్నిటితో పాటు చర్చిల్ కు అమెరికా మూలాలున్నాయి.ఆయన తల్లి జెన్నీ అమెరికన్..
చర్చిల్ తర్వాత మరో ఆరుగురు విదేశీయులకు అమెరికా ఇలాగే గౌరవ పౌరసత్వం ఇచ్చినా వారందరికీ మరణానంతరమే.మళ్లీ ఇలాగే జీవించి ఉండగానే
అమెరికా గౌరవ పౌరసత్వ హోదా లభించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..
మన అమ్మ ధెరిసా
ఆమె 1996 లో ఈ గౌరవాన్ని అందుకున్నారు.