Business

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. అయితే మార్కెట్లలో రెండవ సెషన్ ఒడిదొడుకుల్లోకి జారుకోవటం వల్ల సూచీల లాభాలు ఆవిరయ్యాయి.

బలమైన గ్లోబల్ సూచనలను ట్రాక్ చేస్తూ.. భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు బుల్లిష్‌గా ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 3 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 2 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 86 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 12 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ ముగించింది.

మార్కెట్ల ఒడిదొడుకులకు కారణాలను పరిశీలిస్తే.. పీఎస్ యూ బ్యాంక్ షేర్లు తీవ్ర నష్టాలను చవిచూడటం ఒక కారణం. అమెరికా, ఆసియా మార్కెట్లలో మిశ్రమ వాతావరణం కూడా మార్కెట్లలో అస్థిరతకు కారణంగా ఉంది. మార్కెట్ క్లోజింగ్ సమయంలో దివీస్ ల్యాబ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, సిప్లా, అదానీ పోర్ట్స్, విప్రో, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టి, హెచ్సీఎల్ టెక్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్ స్టాక్స్ లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.