Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (04-06-2023 నుండి 10-06-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం (04-06-2023 నుండి 10-06-2023)

ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి,ఉద్యోగాల్లో కృషితో ఫలితాలు సిద్ధిస్తాయి. ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి, అపార్ధాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చుపెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని మూట కట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి.ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ విష్ణు ధ్యానం చదివితే మేలు.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (04-06-2023 నుండి 10-06-2023)

శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి.మీ రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. కాలం సంపూర్ణంగా సహకరిస్తోంది. అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. తోటి వారి సహకారం అందుతుంది. ఆటంకాలు తొలుగుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆర్థికంగా ఒకమెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (04-06-2023 నుండి 10-06-2023)

ఉద్యోగంలో శుభఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంది. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధి సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన శుభప్రదం
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (04-06-2023 నుండి 10-06-2023)

పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్తలను బాధ్యత అప్పగిస్తారు. ఎన్ని ఆటలున్నా మీరు అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతున్నారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలదు. వారం మధ్యలో అనుకూల ఫలితాలు వెలువడతాయి. దుర్గా ధ్యానం శక్తిని ఇస్తుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (04-06-2023 నుండి 10-06-2023)

మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. సకాలంలో ప్రారంభించండి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది . ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (04-06-2023 నుండి 10-06-2023)

శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నతస్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. సూర్య ధ్యానం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల (04-06-2023 నుండి 10-06-2023)

మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గతానుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు వస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు లేకుండా పెరగాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయకపోతే చెడు అవుతుంది, అనవసర విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలుచేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (04-06-2023 నుండి 10-06-2023)

కార్యసిద్ధి ఉంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి,ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తిని ఇస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యానం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (04-06-2023 నుండి 10-06-2023)

శ్రేష్ఠమైన కాలం. విజయసిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దాని కన్నాఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుపుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంది. కుజ గ్రహ ఆరాధన శుభప్రదం
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (04-06-2023 నుండి 10-06-2023)

ఇష్టమైన కార్యక్రమాలు నెరవేరుతాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరుతాయి. కొత్త ఆలోచనా విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధు,మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య విషయాల్లో ఆవేశం పనికిరాదు. వారాంతంలో శాంతి చేకూరుతుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (04-06-2023 నుండి 10-06-2023)

ఉత్సాహంగా ముందుకు సాగితే అభీష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్ధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొనిపోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవిష్ణు స్తుతి శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (04-06-2023 నుండి 10-06-2023)

వృత్తి,ఉద్యోగాల్లో, ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి . చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనస్సుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈