Politics

నేడు నాగర్ కర్నూల్లో కేసీఆర్ పర్యటన…

నేడు నాగర్ కర్నూల్లో  కేసీఆర్ పర్యటన…

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే ప్రగతి నివేదన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం కొల్లాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో రూ.59 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, రూ.30 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్‌లో నాగర్ కర్నూల్ చేరుకోనున్న కేసీఆర్.. మొదటగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నూతన ఎస్పీ కార్యాలయం, తర్వాత జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.