Politics

మంచిర్యాలలో క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన కేసీఆర్….

మంచిర్యాలలో  క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన  కేసీఆర్….

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ శిలాఫ‌ల‌కాన్ని కేసీఆర్ ఆవిష్క‌రించారు. నూత‌న క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు.రూ.1,748 కోట్లతో చెన్నూర్‌, పర్ధాన్‌పల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్‌ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌కు, గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు.