NRI-NRT

ఇటలీ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోని మృతి….

ఇటలీ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోని  మృతి….

ఇటలీ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోని (86) కన్నుమూశారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయనను గత శుక్రవారం ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, హృదయ సంబంధ సమస్యలతోనూ బాధపడుతున్నారు. 2020లో కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఆసుపత్రిపాలయ్యారు. ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన మిలన్‌లో బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. బెర్లుస్కోని 1936 సెప్టెంబరు 29న మిలన్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. న్యాయపట్టా అందుకున్నారు. ఒకప్పుడు ఆయన క్రూజ్‌ షిప్‌లో గాయకుడిగా పనిచేశారు. తర్వాత నిర్మాణం, మీడియా రంగాల్లో ప్రవేశించి వడివడిగా ఎదిగారు. అపర కుబేరుడిగా మారారు. రాజకీయాల్లో అడుగుపెట్టి.. 1994లో ‘ఫోర్జా ఇటాలియా’ అనే పార్టీని స్థాపించారు.ఇటలీకి 4 సార్లు ప్రధానిగా పనిచేసిన ఆయన అత్యధిక కాలం పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. క్రూజ్ షిప్ గాయకుడైన ఆయన రియల్ ఎస్టేట్, మీడియా రంగంలో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరుడయ్యారు. 1994లో ‘ఫోర్జా ఇటాలియా’ పార్టీని స్థాపించి అదే ఏడాది ప్రధాని అయ్యారు.