Fashion

మొటిమలకు మందరంతో చెక్….

మొటిమలకు మందరంతో చెక్….

ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ కాలుష్యం, పని ఒత్తిడి, పెరుగుతున్న వయస్సుతో సాధారణంగా కాస్త పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ముఖాన్ని వైట్‌గా, కాంతివంతంగా మార్చుకునేందుకు వేలకు వేలు పోగేసి క్రీములు, ఫేస్‌మాస్కులు కొనగోలు చేసినా పెద్దగా ఉపయోగం లేదా? అయితే ఇది మీకోసమే. పైసా ఖర్చులేకుండా మన పెరట్లో దొరికే మందార పూలతోనే ముఖ వర్చస్సును మెరుగుపర్చుకోవచ్చు.సాధారణంగా మందారం పువ్వులను జుట్టు పెరుగుదలకు, ఒత్తుగా పెరిగేందుకు విరివిగా ఉపయోగిస్తుంటారన్నది అందరికి తెలిసిందే. దీనిని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలు దూరం అవుతాయి. కానీ ఈ పువ్వులు కేవలం జుట్టుకే కాదు అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా? అదేలాగా? మందార పువ్వులతో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరు మందార పువ్వులను ఎండబెట్టి పొడిచేయాలి. దీనిలో శనగపిండి, బియ్యప్పిండి, పెరుగు, తేనె అరటీస్పూన్ చొప్పున తీసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం, మందార. పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.