Movies

సంక్రాంతికి గుంటూరు కారం ఉండదేమో…..

సంక్రాంతికి గుంటూరు కారం ఉండదేమో…..

రీసెంట్ గా మహేష్ తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా ‘గుంటూరు కారం’ టీజర్- ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. యూట్యబ్ లో ఇది ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తోంది. మరోవైపు జూన్ 7న కొత్త షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉంది. ఏమైందో ఏమో గానీ జూన్ 12కి, ఆ తర్వాత జూన్ 20కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏకంగా జూలైకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.

హీరో మహేష్ బాబు రెడీగా ఉన్నాసరే కొందరు కీలకమైన యాక్టర్స్ డేట్స్ దొరకలేదని, అందుకే షూటింగ్ వరసగా వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే జనవరి 13న సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఈ వాయిదాలు చూస్తుంటే మాత్రం అది కష్టమేనేమో అనిపిస్తుంది. మరి మహేష్-త్రివిక్రమ్ కలిసి ఏం చేస్తారో చూడాలి?