Movies

పుష్ప 2 ఫైట్ లీక్….

పుష్ప 2 ఫైట్ లీక్….

‘బాహుబలి’ తీసిన రాజమౌళి.. తెలుగు సినిమా రేంజుని పెంచారు. ఆ తర్వాత ‘పుష్ప’ తెలుగోడి అసలు సిసలు మాస్ చూపించింది. నార్త్ ఆడియెన్స్ అయితే ఈ మూవీ చూసి మెంటలెక్కిపోయారు. పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు మేకర్స్.. సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇప్పుడు అలా ఓ వీడియో లీకైంది. అది ఫ్యాన్స్ కి ఫుల్ గూస్ బంప్స్ ఇస్తోంది.

ఈ వీడియోలో భాగంగా ఓ నదిలో ఎర్రచందనం దుంగలతో ఉన్న లారీల మధ్య ఛేజ్ జరుగుతోంది. జీపుల్లో కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే ఇంటర్వెల్ ఫైట్ లా అనిపిస్తుంది. జస్ట్ విజువల్ గా చూస్తే ఏమనిపించకపోవచ్చు గానీ సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోరు పడితే మాత్రం థియేటర్ల పునకాలు వచ్చే ఛాన్సుంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ మూవీ వచ్చే వేసవికి రిలీజయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.