Health

భారత్ సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొత్త మలేరియా వాక్సిన్

R21 మలేరియా టీకాకు ఆమోదం

యూజలోని ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన భారత సీరం ఇన్ స్టిట్యూల్ సంస్థ ఉత్పత్తి చేసిన కొత్త మలేరియా వ్యాక్సిన్ ఆర్ 21/మ్యాటిక్స్ ఎమ్ వినియోగానికి నైజీరియా ప్రభుత్వం 2023 ఏప్రిల్ మూడవ వారంలో ఆమోదం ఇచ్చింది. ప్రపంచంలో ఘనా దేశం తర్వాత ఈ వ్యాక్సిను ఆమోదం ఇచ్చిన రెండవ దేశం నైజీరియా.

* ఆర్ 21 లేదా మ్యాట్రిక్స్ ఎమ్ పేరుతో పిలిచే మలేరియా వ్యాక్సిన్ ఈ వ్యాధి నివారణకు అభివృద్ధి చేసిన రెండవ – వ్యాక్సిన్ మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ఆర్టీఎస్ను 2021వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది.

* 2015 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 9 దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా రహిత దేశాలుగా గుర్తించింది. అవి – మాల్దీవులు, శ్రీలంక, కిర్గిజిస్తాన్, పరాగ్వే, ఉజ్బెకిస్తాన్, అర్జెంటీనా, అల్జీరియా, చైనా (2021), ఎల్ సాల్వడార్ (2021)

మలేరియా వ్యాధి

* దోమల ద్వారా వ్యాపించి, మానవులలో రక్త కణాలను దెబ్బ తీసే వ్యాధి మలేరియా, ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వర్గానికి చెందిన ఈ వ్యాధిని మానవులలో జీవి కలగజేస్తుంది. ఈ పరాన్న జీవులు అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమల కాటు ద్వారా మానవులలోకి. ప్రవేశిస్తాయి. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే మరణం కూడా సంభవిస్తుంది.

* మానవ శరీరంలో ఈ పరాన్న జీవులు మొదట కాలేయ కణాలలో బాగా విభజన చెంది, సంఖ్యను పెంచుకుని బాగా విస్తరిస్తాయి. తర్వాత ఎర్ర రక్త కణాల్లోకి చేరుకుంటాయి.

* మానవులలో మలేరియా కలిగించే పరాన్న జీవులు మొత్తం ఐదు రకాలు 1 ఉన్నాయి. వాటిలో రెండు రకాలు (ప్లాస్మోడియం పాల్సిఫారం, ప్లాస్మోడియం

వైవాక్స్) అన్నింటి కంటే ఎక్కువ ప్రమాదాన్ని కలగజేస్తాయి.. * మలేరియా వ్యాధి ఎక్కువగా ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలైన ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా ఖండాలలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు మానవులలో జ్వరం, ఫ్లూ మాదిరి చిహ్నాలు, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట మొదలైనవి కనిపిస్తాయి.

* తాజా ప్రపంచ మలేరియా నివేదిక ప్రకారం 2021వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 247 మిలియన్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు 2020వ సంవత్సరంలో ఇవి 245 మిలియన్లుగా నమోదయ్యాయి.

* 2022వ సంవత్సరంలో మన దేశంలో 45,000 మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం ఆఫ్రికా ప్రాంతంలో సంభవించిన మొత్తం మలేరియా సంబంధిత మరణాలలో 80 శాతం ఐదు ఏళ్లలోపు పిల్లలవే.

మలేరియా నియంత్రణకు చర్యలు|

1. అంతర్జాతీయ చర్యలు

* ఈ-2025 కార్యక్రమం కింద 2025వ సంవత్సరం లోగా మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు 25 దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది

2016-2030 సంవత్సరాల మధ్యలో అమలు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ | ప్రారంభించిన ‘మలేరియా అంతర్జాతీయ సాంకేతిక వ్యూహం’ కింద మలేరియా కేసులను; దానివల్ల మరణాలు సంభవించే రేటును (2015 నాటి కేసుల సంఖ్య ఆధారంగా) 2020 నాటికి కనీసం 40 శాతం తగ్గించాలనీ; 2025 నాటికి 75 శాతం తగ్గించాలని, 2030 నాటికి 90 శాతం తగ్గించాలనీ లక్ష్యాలు విధించుకున్నారు.

* భారత్ సహా మలేరియా అత్యధికంగా సంభవించే 11 దేశాలలో “ఎక్కువ భారం, ఎక్కువ ప్రభావం” కార్యక్రమం పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం అమలు మన దేశంలోని నాలుగు రాష్ట్రాలలో ప్రారంభించారు. అవి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్.

2. జాతీయ కార్యక్రమాలు

* దేశవ్యాప్తంగా మలేరియా వ్యాధిని 2027వ సంవత్సరాని కల్లా నిర్మూలించాలని భారత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. ఇందుకోసం జాతీయ మలేరియా నిర్మూలనా ఫ్రేమ్ వర్క్ (2016-2030) పేరుతో ఒక కార్యక్రమాన్ని అభివృద్ధి చేసింది.

* ఐదేళ్లలో మలేరియా తొలగింపుకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక: దీన్ని 2017వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది మలేరియా నియంత్రణ నుంచి మలేరియా నిర్మూలన దిశగా దృష్టి కోణాన్ని మార్చింది. 2022వ సంవత్సరాని కల్లా దేశంలోని మొత్తం 766 జిల్లాల్లో 571 జిల్లాలలో మలేరియాను నిర్మూలించేందుకు ఈ ప్రణాళిక రోడ్ మ్యాప్ను ఏర్పాటు. చేసింది.

* మలేరియా నిర్మూలన పరిశోధనా కూటమి (మలేరియా ఎలిమినేషన్ రిసెర్చ్ ఎలయన్స్) – భారత్: దీన్ని భారత వైద్య పరిశోధనా మండలి ప్రారంభించింది. దేశంలో మలేరియా నియంత్రణకు పని చేస్తున్న భాగస్వామ్య సంస్థల కూటమిగా ఇది పని చేస్తోంది.