WorldWonders

ఆక్సిజన్ లేకుండా మంటల్లో ఎక్కువ దూరం ప్రయాణించినందుకు గిన్నిస్ రికార్డు

ఆక్సిజన్ లేకుండా మంటల్లో ఎక్కువ దూరం ప్రయాణించినందుకు  గిన్నిస్ రికార్డు

ఒక విచిత్రమైన పోటీలో పాల్గొని ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే స్టంట్ మ్యాన్. ఆక్సిజన్ తీసుకునే అవకాశం లేకుండా ఒంటికి నిప్పంటించుకుని 100 మీటర్ల పరుగు పందాన్ని 17 సెకండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డుతో పాటు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.  ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే 39 ఏళ్ల స్టంట్ మాస్టర్ కు చిన్నప్పటి నుండి స్టంట్స్ అంటే చాలా ఇష్టమట. అందులోనూ నిప్పుతో చెలగాటమాడటం అంటే అతడికి మహా సరదా. నిప్పును నోట్లో వేసుకుని విన్యాసాలు చేయడం వంటి ఎన్నో సాహసాలు చేయడం అతడికి అలవాటు.

అందులో భాగంగానే ఒళ్ళంతా నిప్పు అంటించుకుని కాలుతూ పరిగెత్తడంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మంటల్లో మండుతూ 272.25 మీటర్లు పరిగెత్తి కాలుతూ ఆక్సిజన్ తీసుకోకుండా ఎక్కువ దూరం పరిగెత్తిన రికార్డుతో పాటు 17 సెకండ్లలో 100 మీటర్లు పూర్తి చేసి పాత రికార్డును చెరిపేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కేవలం ప్రపంచ రికార్డు మాత్రమే కాదు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు జోనథన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ స్వయంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులే వీడియోతో సహా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోకు   మిలియన్లలో వీక్షణలు దక్కాయి. నెటిజన్లు ఈ వీడియోకు ఇలాంటి చెత్త రికార్డులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.