Politics

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు ఐదు గంటలుగా కేబినెట్‌ భేటీ కొనసాగింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులు, రైతులకు జరిగిన నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించినట్లు సమాచారం. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులపై చర్చించినట్లు తెలుస్తోంది. మెట్రో రైలు విస్తరణ, కొత్త కారిడార్లకు అనుమతి, బుద్వేల్ భూముల అమ్మకం, వరంగల్‌ మామునూరు విమానాశ్రయం అభివృద్ధిపై చర్చకు వచ్చినట్లు సమాచారం.రాష్ట్ర గవర్నర్‌ వెనక్కి పంపిన బిల్లులపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బిల్లుల్లో ఏమైనా మార్పులు చేసి తిరిగి ప్రవేశపెట్టాలా? లేదా ఎలాంటి మార్పులు లేకుండా అలాగే ఉంచాలా? అనే విషయాలపై మంత్రివర్గ భేటీలో చర్చించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇంకా పూర్తి చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఏమైనా చేయాలా?అనే విషయాలపైనా సుదీర్ఘంగా కేబినెట్‌ భేటీలో చర్చ సాగినట్లు తెలుస్తోంది.

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు :-

ఆగస్టు 3నుండి తెలంగాణ సమావేశాలు

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

ప్రభుత్వ ఉద్యోగులుగా 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది

వచ్చే అసెంబ్లీ సెషన్లోనే బిల్లు

వరద తక్షణ సాయంగా రూ.500కోట్లు విడుదల

జేబీఎస్ నుండి తూకుంట వరకు డబుల్ డెక్కర్ ప్లై ఓవర్

ఉప్పల్ నుండి బీబీ నగర్,షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ

ఎయిర్ పోర్టు నుండి కందుకూరు వరకు మెట్రో పొడిగింపు

ఎల్బీ నగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు

ఉప్పల్ నుండి ఈసీఎల్ క్రాస్ రోడ్డు వరకు మెట్రో

మియాపూర్ నుండి లక్డీడ్ కపూల్ వరకు

రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు

ప్యాట్నీ నుండి కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ

హకీంపేట ఎయిర్ పోర్టు ను పౌరసేవలకు వాడటానికి
కేంద్రానికి ప్రతిపాదనలు

వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం

మున్నేరు వాగు వెంట రిటైనింగ్ వాల్

వరదల వల్ల దెబ్బ తిన్న రోడ్లు వెంటనే తాత్కాలిక మరమత్తులు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజ్ శ్రావణ్,కుర్రా సత్యనారాయణ

విద్యుత్ వీరులకు ఆగస్టు 15న సత్కారం