NRI-NRT

రత్న పురస్కారాలు ప్రారంభించిన రాతెస

రత్న పురస్కారాలు ప్రారంభించిన రాతెస

రాష్టేతర తెలుగు సమాఖ్య ఇకపై ప్రతీ ఏడాది ఏడు రంగాల్లో నిష్ణాతులైన రాష్టేతర తెలుగు ప్రాంతాలకు చెందిన వారికి రత్న జాతీయ పురస్కారాలు అందజేస్తుందని సంస్థ అధ్య క్షులు రాళ్లపల్లి సుందరరావు, ప్రధాన కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్ ఆదివారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. తెలుగు రత్న, సాహిత్య రత్న, నాట్యరత్న, నాటకరత్న, శిక్షకరత్న, మహిళా రత్న, సంగీత రత్న అవార్డులు అందజేసి, రూ.10వేల నగదు, రవాణా ఖర్చులతోపాటు సన్మానం చేయనున్నట్లు చెప్పారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ పురస్కారాలకు అర్హులను ఎంపిక చేస్తుందన్నారు.. అవార్డుల ప్రదాన కార్యక్రమం బెంగళూరు, తెలుగు విజ్ఞాన వేదికగా డిసెంబరు 23, 24 తేదీల్లో జరుగుతుందన్నారు.

పురస్కారాలకు వివరాలు అందవలసిన ఆఖరు తేదీ అక్టోబరు10. RTS email. rashtretaratelugusamakhya@gmail.com or whatsap no.+919825114404