Devotional

జనవరి 22న అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ

జనవరి 22న అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ

ఉత్తరప్రదేశ్‌ రామ జన్మ భూమి అయోధ్యలో నిర్మించిన ఈ రామాలయంలో జనవరి 22 న రామాలయాన్ని ప్రారంభించనున్నారు. గర్భగుడిలో రామయ్యను ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు అయోధ్యలో జరుగుతున్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ రామాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆహ్వానాలు పంపబడ్డాయి.

రామాలయ ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందే ప్రాణ ప్రతిష్ఠ పూజలు ప్రారంభిస్తారని సమాచారం. సన్నాహాలకు సంబంధించి ఇటీవల సీఎం యోగి, ప్రధాని మోడీ మధ్య సమావేశం కూడా జరిగింది. ఇందుకు సంబంధించి ఢిల్లీలో ప్రధాని మోడీకి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో రామ మందిర మ్యూజియంతో సహా అయోధ్య అభివృద్ధి సహా అనేక విషయాలను చర్చించారు. ఈ ఏడాది డిసెంబర్‌ లో రామమందిర నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు.

ఈ సమావేశంలో రామమందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పాల్గొన్నారు. రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి రెండు రోజుల నుంచి భవన నిర్మాణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రామమందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అలోక్ కుమార్, ఉపాధ్యక్షుడు జీవేశ్వర్ మిశ్రా పాల్గొన్నారు.