Politics

తన కేసు తానే వాదించుకున్న చంద్రబాబు

తన కేసు తానే వాదించుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. శనివారం ఆయన్ని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పేరును ఏపీ సీఐడీ చేర్చింది. ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుతో సహా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. ఏయితే ఓపెన్ కోర్టులో వాదనలు వినాలని టీడీపీ లీగల్ టీమ్ విజ్ఞప్తి చేయగా.. దీనికి న్యాయముర్తి అంగీకరించారు. ఇక చంద్రబాబు తరుపున సిద్ధార్థ లూథ్రా బృందం.. అలాగే సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనలు కోర్టుకు వినిపిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ పరిసరాలను తమ ఆధినంలోకి తీసుకున్నారు. అయితే ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు స్వయంగా తన వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే నన్ను అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబు తన వాదనాలు చేసిన తర్వాత కోర్టు హాలులో ఉంటారా లేదా అని న్యాయవాది అడిగారు. ఇందుకు సమాధానంగా కోర్టు హాలులోనే ఉంటానని చంద్రబాబు బదులిచ్చారు. అయితే ప్రస్తుతం సిద్ధార్థ్ లూలు చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్నారు.