ScienceAndTech

భారత్‌లో తయారైన ఐఫోన్ 15 భారత్‌లోనే ఖరీదు ఎక్కువ

భారత్‌లో తయారైన ఐఫోన్ 15 భారత్‌లోనే ఖరీదు ఎక్కువ

టెక్‌ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూసిన యాపిల్‌ లేటెస్ట్‌ ఐఫోన్లు విడుదలయ్యాయి. ఐఫోన్‌ 15 సిరీస్‌ (iPhone 15) విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌ 15, 15 ప్లస్‌, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌ దేశీయ ధరలను సైతం యాపిల్‌ ప్రకటించింది. అయితే, అమెరికా, దుబాయ్‌తో పోలిస్తే భారత్‌లోనే ధర ఎక్కువ. పైగా దేశంలో తయారయ్యే ఐఫోన్ల ధరలు కూడా ఆయా దేశాలతో పోల్చినప్పుడు అధికంగా ఉండడం గమనార్హం. ఐఫోన్‌ 15 మోడల్‌ ధరను యాపిల్‌ అమెరికాలో 799 డాలర్లుగా ప్రకటించింది. అదే మోడల్ భారత్‌ ధర రూ.79,900గా యాపిల్‌ పేర్కొంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83 అనుకుంటే రూ.66 వేలు అవుతుంది. కానీ, దీని ధర దాదాపు 20 శాతం అధికంగా ఉండడం గమనార్హం. అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హమ్‌లలో దీని ధర 3,399 కాగా.. భారత రూపాయాల్లోకి (22 రూపాయలు = 1 దిర్హమ్‌) మారిస్తే రూ.76 వేలు అవుతుంది. దుబాయ్‌తో పోల్చినా భారత్‌లోనే ధర ఎక్కువన్నమాట. ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్‌దీ అదే పరిస్థితి.