NRI-NRT

పెనమలూరు విద్యార్థులకు తానా ఉపకారవేతనాలు

పెనమలూరు విద్యార్థులకు తానా ఉపకారవేతనాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఉపకారవేతనాలను కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన 15మంది పేద విద్యార్థులకు అందించారు. ప్రవాసాంధ్రుడు మలినేని ఠాగూర్ ఈ ఉపకారవేతనాలకు ఆర్థిక సహకారం అందజేశారు. సొంతూరు అభివృద్ధికి తానా ద్వారా కృషి చేస్తానని ఠాగూర్‌ అన్నారు. పెనమలూరు ఎన్నారై స్థానిక ప్రతినిధులు పాలడుగు సుధీర్, మోర్ల నరేంద్ర బాబు, కిలారు ప్రవీణ్, కోనేరు సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.