Politics

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువురు న్యాయవాదులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను సాల్వే ప్రస్తావించారు. భోజన విరామం అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z