Food

అంగన్‌వాడీలో ఇచ్చే పౌష్టికాహారం ప్యాకెట్ లో పాము కళేబరం!

అంగన్‌వాడీలో ఇచ్చే పౌష్టికాహారం ప్యాకెట్ లో పాము కళేబరం!

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పింపిణీ చేసే పౌష్టికా హారంలో ఎండు ఖర్జూరం ప్యాకెట్‌లో పాము కళేబరం ఉన్న విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్ర పరిధిలో గర్భిణులకు ఈ నెల నాలుగో తేదీన ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టికాహారంలో ఎండు ఖర్జూరాలు ఉన్నాయి. గర్భిణి మానస తనకు ఇచ్చిన ప్యాకెట్‌ తీసుకుని శ్రీమంతం నిర్వహించుకునేందుకు మండలంలోని వేసనపల్లెలోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ప్యాకెట్‌ విప్పి చూడగా అందులో పాము కళేబరం ఉండటాన్ని గుర్తించి అవాక్కై అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ రెడ్డి కల్యాణి ద్వారా సీడీపీవో వాణిశ్రీదేవికి సమాచారం ఇచ్చింది. పాము కళేబరం ఉన్న మాట వాస్తవమేనని, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని, మానసకు మరో ప్యాకెట్ ఇవ్వాలని గుత్తేదారును ఆదేశించాని సీడీపీవో తెలిపారు.