ScienceAndTech

విక్రమ్-1కు తెలంగాణ లో తయారైన రాకెట్ యంత్ర భాగాలు

విక్రమ్-1కు తెలంగాణ లో తయారైన రాకెట్ యంత్ర భాగాలు

టీ హబ్‌ కేంద్రంగా మొదలైన ‘స్కైరూట్‌’ సొంతంగా రాకెట్‌ ప్రయోగాలను సంబంధించిన యంత్ర పరికరాలను రూపొందిస్తున్నది. తాజాగా విక్రమ్‌-1 పేరుతో ప్రయోగించే రాకెట్‌ కోసం యంత్ర భాగాలను నగరంలోని తమ పరిశోధన కేంద్రంలో ప్రయోగానికి సిద్ధం చేసింది. ఈ మేరకు నగరంలో 10 మీటర్ల పొడవుతో రూపొందించిన మొదటి దశ కంపోజిట్‌ మోటార్‌ (కలామ్‌ 1200)ను శ్రీహరికోటకు తరలించింది. ఇప్పటికే కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ విక్రమ్‌-1 రాకెట్‌ లాంచ్‌ వెహికిల్‌ను పరిశీలించి వెళ్లారు. అదేవిధంగా నాలుగు రోజుల కిత్రమే సుమారు రూ.225 కోట్ల నిధులు స్కైరూట్‌కు సమకూరాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఏరోస్పేస్‌ స్టార్టప్‌గా సేవలను ప్రారంభించిన స్కైరూట్‌ అటు ప్రయోగాలు చేయడంలోనూ కొత్తగా నిధుల సమీకరణలోనూ సత్తా చాటుతున్నది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z