Videos

‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ట్రైలర్

‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ట్రైలర్

కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్‌ (Raghava Lawrence), ఎస్‌జే సూర్య (SJ Surya) లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్‌ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). 2014లో యాక్షన్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రిలీజై త‌మిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన జిగర్‌తండ (Jigarthanda) చిత్రానికి డబుల్ ఎక్స్ సీక్వెల్‌గా వస్తోంది. (ఇదే సినిమాను తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్(Gaddalakonda ganesh) అంటూ రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు.) ఈ మూవీకి కోలీవుడ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు (karthik subbaraj) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు జిగర్తాండ 2 టీజర్‌ల‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు,పాన్ ఇండియాలో ఇప్పుడు వచ్చే సినిమాల్లో.. అతనిలాంటి ఒక నల్లని హీరోను ఊహించుకుని చూడండి అంటూ ట్రైల‌ర్‌ మొదల‌వుతుంది. నలుపు అంటే అంత చులకనా నీకు అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ నడుస్తుండ‌గా.. సినిమాల్లో హీరో అంటే తెల్లగానే ఉండాలిగా మరి అనే చెప్పాగానే. తెలుగు సినిమాలో మొదటి నల్ల హీరో అంటూ.. గుర్రంపై వస్తున్న లారెన్స్‌ను ఎంట్రీ ఇస్తాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z