DailyDose

నేను కేసీఆర్ కు ఫేవర్ కాదు-తాజా వార్తలు

నేను కేసీఆర్ కు ఫేవర్ కాదు-తాజా వార్తలు

* నేను కేసీఆర్ కు ఫేవర్ కాదు

తాను కేసీఆర్ మనిషిననేది కేవలం ప్రచారం మాత్రమేనన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తాను కేసీఆర్‌కు ఫేవర్ కాదని.. బీజేపీకి మాత్రమే ఫేవరనని తెలిపారు. మభ్యపెడితే లొంగిపోయే నాయకుడిని కాదన్న ఆయన.. బీజేపీ వ్యక్తులతో నడిచే పార్టీ కాదన్నారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా మార్చటం పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. సోనియా గాంధీని కూడా ఈడీ విచారించింది. కానీ అరెస్ట్ చేయలేదు..సోనియాను అరెస్ట్ చేయలేదని.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనా అని ఆయన మండిపడ్డారు. కవిత అరెస్ట్ అంశం దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉంటోంది. బీజేపీకి ఏమి సంబంధం అని ప్రశ్నించారు.

* మహిళా రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత మరో పోరాటం

మహిళా రిజర్వేషన్ల కోసం ప్రతిపక్షాల మద్దతు కోరుతూ ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. దాదాపుగా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. లోక్ సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్ సభ స్థానాలకు మహిళా రిజర్వేషన్లకు సంబంధం లేదని ప్రతిపక్షాలు కేంద్రం తీరును తప్పుబట్టాయి. లిక్కర్ కేసు తెర మీదికి వచ్చిన సందర్భంలోనే ఆమె ఢిల్లీలో మహిళల రిజర్వేషన్ల కోసం పోరాడారు. తాజాగా, మరోమారు ఆమె అరెస్టు గురించి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర బీజేపీ నేతలు మాట్లాడిన సందర్భంలో తాజా ప్రకటన రావడం ఆశ్చర్యకరంగా ఉన్నది. తాజాగా, భారత్ జాగృతి అధినేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. 2029 ఎన్నికలకు కాదు.. తక్షణమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తమ పోరాటానికే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తెచ్చిందని అన్నారు. అయితే, చట్టంగా మారిన తర్వాత మహిళల రిజర్వేషన్లను అమలు చేయడంలో జాప్యం వహించే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని పలు పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని, తాను వాటికి మద్దతు ఇస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలు కోసం తాము న్యాయపోరాటం చేస్తామని కవిత చెప్పారు. ఇది వరకే పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో తాము ఇంప్లీడ్ అవుతామని తెలిపారు.

* 12న తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

ఇవాళ రాత్రి 4 వ విడత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. ఈ నెల 12, లేదా 13 న మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు. 9 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు కిషన్ రెడ్డి. ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. విపక్షాలను, ప్రజా సంఘాల ఆందోళనలను సీఎం అణిచివేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని ఆరోపించారు. కేసీఆర్ నియంతలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఫైరయ్యారు. కేంద్రం నిధులతో తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి చేశామన్నారు కిషన్ రెడ్డి

* ఒడిస్సాలో కలకలం సృష్టిస్తున్న పులులు

కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు జిల్లా తిరుమలలో చిరుతలు బీభత్సం సృష్టించిన విషయం అందరికి సుపరిచితమే.. అప్పుడు తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు ప్రజలు చాల భయపడ్డారు. అయితే ప్రభుత్వం చర్యలను తీసుకుని చిరుతల బెడదను తొలిగించింది. కాగా ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో పులులు కలకలం సుష్టిస్తున్నాయి. దీనితో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాలలోకి వెళ్తే.. శనివారం ఒడిస్సా రాష్ట్రం లోని నువాపాడ జిల్లా సదర్ రేంజ్, ధరంబంధ పోలీస్ స్టేషన్, సిలారిబహరా గ్రామం లో దారుణం చోటు చేసుకుంది. శనివారం నువాపాడ జిల్లా లోని సిలారిబహరా గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామేశ్వరి మాఝీ(50) పైన పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె మరణించగా అనంతరం ఆమె మృతదేహాన్ని పులి తినేసింది.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకున్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఆదివారం మరో పులి మళ్లీ భీభత్సం సృష్టించింది. ధర్మబంధ పోలీస్ స్టేషన్ పరిధి లోని కోడోపాలి గ్రామంలో ఓ చిన్నారిపై పులి దాడి చేసింది. కాగా ఆ పులి భారీ నుండి గ్రామస్థులు చిన్నారిని రక్షించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో నువాపా జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ధర్మబంధ పోలీస్ స్టేషన్ పరిధి లోని కోడోపాలి గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు కోడోపలికి చేరుకుని పులి సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

* ఢిల్లీలో మరో ఐదు రోజులు స్కూల్స్‌ బంద్‌

దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయింది. గాలి కాలుష్యంతో (Air pollution) హస్తినలోని చాలాచోట్ల వాయు నాణ్యత సూచీ 450 పాయింట్లు దాటింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశ రాజధానిలో ప్రాథమిక పాఠశాలలకు (Primary Schools) మరో ఐదు రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇప్పటికే నేటివరకు హాలీడేస్‌ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ నెల 10 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆరు నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని, అయితే విద్యార్థులు ఆన్‌క్లాసులు (Online Classes) కూడా వినవచ్చని స్పష్టం చేసింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి అతిశి (Minister Atishi) సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.ఢిల్లీలో వరుసగా ఆరో రోజూ వాయు నాణ్యత (Air quality) 460 పాయింట్లు దాటింది. షాదీపూర్‌, వజీర్పూర్‌, ఓఖ్లా సహా పలుచోట్ల దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి పీల్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. విషవాయుల గాఢత (పీఎం) 2.5 సాయిలో ఉన్నది. ఇది డబ్ల్యూహెచ్‌వో జారీచేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవడంతోపాటు కంటి దురద, శ్వాస కోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైదులు ఆందోళన వ్యక్తచేస్తున్నారు.

* పురందేశ్వరిపై పెద్దిరెడ్డి ఫైర్‌

పురంధేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తరపున ఆమె మాట్లాడితే ఇబ్బంది లేదని, అయితే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనన్నారు. మద్యంపై చంద్రబాబుతో పురంధేశ్వరి మాట్లాడితేనే మంచిదన్నారు.విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్లను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గక ఇంఛార్జ్‌ దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మేయర్‌ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్లో సచిన్ సందడి

TS: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్లో సందడి చేశారు. NEB స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్వహించిన హాఫ్ మారథాన్-2023లో బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ విషయాన్ని సచిన్ ట్వీట్ చేశారు. 8వేల మంది ఔత్సాహికులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అద్భుతంగా ఉందన్నారు. మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లే చెట్లను సంరక్షించడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

* మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి

హఠాత్తుగా కింద పడిపోయిన వ్యక్తికి ఓ జవాన్‌ సకాలంలో సీపీఆర్‌ (CPR) చేసి ప్రాణాల్ని కాపాడారు. ఈ ఘటన దిల్లీలోని నంగ్లోయ్‌ మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. అనిల్‌ కుమార్‌(58) అనే వ్యక్తి మెట్రోస్టేషన్‌లో చెకింగ్‌ పాయింట్‌ దాటిన తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఉత్తమ్‌ కుమార్‌ సకాలంలో స్పందించి అతడికి కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (CPR) అందించడం ద్వారా ప్రాణాల్ని నిలబెట్టారు. ఈ ప్రక్రియ చేసిన వెంటనే ఆ ప్రయాణికుడు స్పృహలోకి రాగా.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్‌ఎఫ్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసింది. అనిల్‌ కుమార్‌ అనే ప్రయాణికుడికి సీపీఆర్‌ అందించడం ద్వారా ఎంతో విలువైన ప్రాణాల్ని సిబ్బంది కాపాడారని, అతడు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది.

* అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ (Delhi) అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై నగరాలు టాప్‌ 5లో ఉన్నాయి. ఈమేరకు స్విస్‌ గ్రూప్‌ ఐక్యూ ఎయిర్‌ (Swiss Group IQAir) నివేదికను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 483గా ఉంది. దీంతో ఐక్యూ ఎయిర్‌ జాబితాలో ఢిల్లీ మొదటి ప్లేస్‌లో ఉంది. ఇక 371 పాయింట్లతో పాకిస్థాన్‌లోని లాహోర్‌ రెండో స్థానంలో ఉండగా, కోల్‌కతా (206), బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (189), పాకిస్థాన్‌లోని కరాచీ (162) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక 162 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో ఉండగా, చైనాలోని షెన్యాంగ్ (159), హాంగ్జౌ (159), కువైట్ సిటీ (155), చైనాలోని వుహాన్ (152) టాప్‌ టెన్‌లో నిలిచాయి.తక్కువ ఉష్ణోగ్రతలు, గాలి సరిగా లేకపోవడంతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పొలాల్లోని పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీలో గాలి కలుషితం అవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏక్యూఐ 550కి చేరుకోవడంతో 2 కోట్ల మంది ప్రజలు కంటి, గొంతు సమస్యలతో బాధపడుతున్నారు.ఏక్యూఐ 0-50గా ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్టు భావిస్తారు. కానీ, ఢిల్లీలో ఏ సమయంలో చూసినప్పటికీ 400-500గా ఉండడంతో.. ఈ గాలిని పీల్లచడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ-రాజధాని ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు.

* గంగవ్వ చుట్టూ తెలంగాణ రాజకీయం

ఎన్నికల వేళ ‘మై విలేజ్ షో’ స్టార్ గంగవ్వ ట్రెండ్ అవుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్రలో గంగవ్వ ‘బజ్జీలు’ చేసుకుని వెళ్లి ఆయనకు అందించారు. తాజాగా KTR ఆమెతో కలిసి చికెన్ వండారు. దీంతో అప్పుడు అభిమానంతో రేవంత్ను గంగవ్వ కలిసిందని, ఇప్పుడు ఓట్ల కోసం KTR ఆమెను కలిశారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కానీ గతంలో ఓ ఈవెంట్లో ఆమెకిచ్చిన మాట ప్రకారమే KTR గంగవ్వను కలిశారని BRS కౌంటర్ ఇస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z