Videos

లేబుల్‌’ తెలుగు ట్రైలర్‌

లేబుల్‌’ తెలుగు ట్రైలర్‌

‘మేము ఎవరన్నది ఎవరెవరో డిసైడ్‌ చేస్తున్నారు. కానీ, మేమెవరన్నది మేము చెప్పాలి’ అంటున్నారు తమిళ కథానాయకుడు జై (Jai). ఆయన కీలక పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘లేబుల్’ (Label). అరుణ్‌రాజా కామరాజ్‌ తెరకెక్కించారు. తాన్య హోప్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో నవంబరు 10వ తేదీ నుంచి తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులోకి రానుంది. లీగల్‌ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ను హాట్‌స్టార్‌ విడుదల చేసింది. జడ్జి అవుదామనుకున్న ఓ యువకుడి కలను కొందరు వ్యక్తులు ఎందుకు అడ్డుకున్నారు? దాని వెనుక కారణం ఎవరు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z