Devotional

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం తుమ్ కూరు-కర్ణాటక

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం తుమ్ కూరు-కర్ణాటక

🔔🔔🔔🔔🔔

కర్నాటకలోని తుమకూరు జిల్లా గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం..కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఆమె భక్తులతో నీరాజనాలు అందుకొంటోంది.
.
బెంగళూరుకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన కథనం ఆసక్తికరం.

ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలో గొరవన హళ్లి ప్రాంతంలో గోవుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అవి చేసే శబ్దాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి గొరవన హళ్లి అని పేరు వచ్చింనట్లు చెబుతారు.

ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో అరసు వంశానికి చెందిన అబ్బయ్య నిత్యం పశువులను మేపుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆయన నరసయ్యనపాళ్య గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లగా తనను ఇంటికి తీసుకు వెళ్లాల్సిందిగా ఒక ఆడ స్వరం వినిపించింది

దీంతో అతను ఆ స్వరం వినిపించిన చోటు వెదుకగా విచిత్ర రంగులో మెరిసిపోతున్న ఒక రాతి పలక కనిపింది. దీంతో తన తల్లి అనుమతి తీసుకుని శిలా రూపాన్ని తన ఇంటికి తీసుకువెళ్లి భక్తి శ్రద్ధలతో పూజించాడు.

దీంతో అతడు కొద్దికాలంలోనే ధనవంతుడిగా మారిపోయి తన కుటుంబంతో సుఖంగా జీవించసాగాడు.

కొన్ని రోజుల తర్వాత అబ్బయ్య తమ్ముడైన తోటప్పయ్య లక్ష్మీ దేవిని పూజించడం మొదలుపెట్టాడు. ఒకరోజు లక్ష్మీ దేవి ఆయన కలలో కనిపించి తనకు గొరవనహళ్లిలో ఒక దేవాలయాన్ని నిర్మించి తన విగ్రహాన్ని అక్కడ పున:ప్రతిష్టించాలని సూచించింది.

క్రమంగా దేవాలయానికి భక్తుల రాకపోకలు పెరిగాయి. ముఖ్యంగా ఈ లక్ష్మీ దేవిని కొలిచిన వారి కష్టాలు తీరి వారు సంపన్నులుగా మారుతూ వచ్చారు.

అంతేకాకుండా పెళ్లికాని అమ్మాయిలు 48 రోజుల పాటు గొరవన హళ్లి లక్ష్మీ దేవిని ఆరాదిస్తే వివాహ యోగం కలుగుతుందని నమ్ముతున్నారు.

దీంతో కేవలం కర్నాటక నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

అంతేకాకుండా ఆషాఢమాసం చివరి శుక్రవారం ఇక్కడ జరిగే చండికా హోమం, శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సమయంలో వేల సంఖ్యలో మహిళా భక్తులు హాజరవుతారు.

తుమకూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొరవన హళ్లికి చేరుకోవడానికి తుమకూరు హైవేలోని దాబాస్ పేట మీదుగా రోడ్డు మార్గం చాలా బాగుంది. తుమకూరు నుంచి వచ్చేవారు కొరటగెరె మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.
గొరవనహళ్లికి సమీపంలో చుట్టు పక్కల దేవరాయన దుర్గా, నామద చిలుమె, సిద్దర బెట్ట, సిద్ధగంగా, శివ గంగా వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

జై శ్రీమన్నారాయణ

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z