Politics

సీఎం జగన్ లైఫ్ స్టైల్

సీఎం జగన్ లైఫ్ స్టైల్

సీఎం జగన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా…

ఉదయం 4:30 గంటలకు జగన్ నిద్ర లేస్తారు. గంటసేపు యోగ, జిమ్ లాంటివి చేస్తారు. 5:30 కి న్యూస్ పేపర్స్ చదవడంతో పాటు ముఖ్యమైన అంశాలను గురించి నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ సమయంలో టీ మాత్రమే తాగుతారు. 7 గంటలకు జ్యూస్ తీసుకుంటారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులు డ్రై ఫ్రూట్స్ తింటారు. ఇక సమీక్షలు చేసే సమయంలో చాక్లెట్ బైట్స్ తింటారు. మధ్యాహ్న భోజనంలో అన్నం కంటే పుల్కాలని ఇష్టపడతారు.

అప్పుడప్పుడు రాగి ముద్ద, మటన్ కీమాను తింటారు. మధ్యాహ్నం భోజనం లో కొండ పెరుగు ఉండాల్సిందే.

చిత్రాన్నమంటే జగన్ కు చాలా ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. పల్లీలతో పాటు మొక్కజొన్న పొత్తులంటే ఆయనకు చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా వాటిని తింటారు..

వీకెండ్ లో పూర్తిగా ఫ్యామిలీతో గడిపే జగన్ నాన్ వెజ్ కు అత్యంత ప్రాధాన్యమిస్తారు.

ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యాని, మటన్ లాంటి వంటలు ఉండాల్సిందే.

ఇన్ని రకాల వంటకాలకు ఇష్టపడిన జగన్ మాత్రం మితంగానే తింటారు..

లీటర్ పాలలో పచ్చి అల్లం వేసి మరిగించిన తర్వాత వాటిని జగన్ తాగుతారు. అది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని జగన్ అలా చేస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z