DailyDose

విశాఖ కొమ్మాది కూడలిలో రోడ్డు ప్రమాదం

విశాఖ కొమ్మాది కూడలిలో రోడ్డు ప్రమాదం

విశాఖ కొమ్మాది కూడలిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z