DailyDose

రేపు హైదరాబాద్‌కు జగన్‌- తాజా వార్తలు

రేపు హైదరాబాద్‌కు జగన్‌- తాజా వార్తలు

* తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి

ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం తెదేపాలో చేరారు. ఆయన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునందరెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబసభ్యులంతా చంద్రబాబు సమక్షంలో తెదేపా గూటికి చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. ద్వారకానాథరెడ్డి మేనకోడలు అలేఖ్యరెడ్డి.. దివంగత సినీనటుడు నందమూరి తారకరత్న సతీమణి. 1994లో తెదేపా నుంచి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కాగా, పలు మండలాలు రాయచోటిలో విలీనమయ్యాయి. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

రేపు హైదరాబాద్‌కు జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీఎం జగన్‌ పరామర్శిస్తారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌ బాత్రూమ్‌లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగింది. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. కొలుకున్న అనంతరం విశ్రాంతి కోసం కేసీఆర్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని తన పాత నివాసానికి చేరుకున్నారు.

*  వీఆర్ఏలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న వీఆర్ఏల జీతాలకు క్లియరెన్స్ లభించింది. వివిధ శాఖల్లో వీలినమైన 15,560 మంది, రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టుల ద్వారా పని చేస్తోన్న వారందరికీ పెండింగులోని ఏడు నెలల వేతనాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మెమో జారీ చేశారు. జీవో నం.81, 85ల ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్/రికార్డు అసిస్టెంట్స్/ జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వారందరికీ రెగ్యులర్ పే స్కేల్‌ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నెలలుగా వేతనాల్లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వీఆర్ఏలకు ఉపశమనం లభించింది.

అయోధ్య ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్, వీహెచ్‌పీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ పవన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలను వివరించారు. జనవరి 22న ఆయోద్యలో రామ మందిర ప్రారంభానికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను విషయం తెలిసిందే

తెదేపా కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

విజయనగరంలో తెదేపా కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక అప్పారావు గుండెపోటుతో గతేడాది సెప్టెంబరు 10న మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య పద్మావతి, కుమారుడు జయంత్‌సాయితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కును అందించి.. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు..?

తెలంగాణ బీజేపీ స్టేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. సావిత్రి భాయి పూలే ఆశయాలను మోడీ కొనసాగిస్తున్నారు.. కేంద్ర మంత్రివర్గంలో మహిళలకు పెద్ద పీట వేశారు అని తెలిపారు. మహిళ స్వయం శక్తి బృందాలకు చేయూతనిస్తున్నారు.. అలాగే, కేంద్ర ప్రభుత్వం మహిళ సాధికారతకు కృషి చేస్తుంది.. కేంద్ర ప్రభుత్వం త్రిబుల్ తలాక్ ను రద్దు చేశాం.. చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ లు కల్పించామని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు అనే విషయాన్ని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. నొక్కిన డబ్బును కక్కిస్తామని చెప్పారు.. అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.. సీబీఐ విచారణ చేయిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.. బీఆర్ఎస్- కాంగ్రెస్ వేరు కాదని ఇప్పుడు నిరూపితం అవుతుందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీలు కలుస్తాయని బీజేపీ ముందే చెప్పింది.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేస్తాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు.

వైసీపీకి షాక్

తెలుగుదేశం పార్టీలో సి. రామచంద్రయ్య చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నుంచి బలిజ నేతగా, సీనియర్ నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అంతేకాదు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు సి. రామచంద్రయ్య దూరంగా ఉంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయంలో సి. రామచంద్రయ్య కనిపించడంతో త్వరలో ఆయన సైకిలెక్కబోతున్నారనే ప్రచారం మొదలైంది. కడప జిల్లా రాజంపేట నియోజవకర్గంకు చెందిన సి. రామచంద్రయ్య 1981లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు మంత్రిగా కూడా పని చేశారు. వివిధ పార్టీలో చేరి కీలక పదవులను సైతం అలంకరించారు. తాజాగా సి.రామచంద్రయ్య తెలుగుదేశం గూటికి చేరబోతున్నారంటూ రాజంపేటలో ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతోందో చూడాలి.

*  సీఎం జగన్‌ను కలవనున్న వైఎస్‌ షర్మిల

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ఈ రోజు భేటీ కానున్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసంలో ఆయన్ని కలవనున్నారు సోదరి షర్మిల.. అయితే, చాలా గ్యాప్‌ తర్వాత అన్నా చెల్లెలు కలవనుండడం.. అది కూడా ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరేముందు.. ఆయన్ని కలిసి వెళ్తుండడంతో.. ఫ్యామిలీ మీటింగే అయినా.. రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, ఇప్పటికే ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామా చేసి.. తన ప్రయాణం వైఎస్‌ షర్మిలతోనే అని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిక, వైఎస్‌ జగన్‌తో సమావేశంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z