DailyDose

ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన-నేర వార్తలు

ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన-నేర వార్తలు

* పొరుగింటి మహిళకు నిప్పంటించి హత్య చేసిన మహిళ

పొరుగింటి మహిళకు నిప్పంటించి ఓ మహిళ హత్య చేసిన కారణం తెలిసిన పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌లో ఉండే అఫ్షానా బేగం అనే యువతి ఆటో డ్రైవర్ అయిన ప్రవీణ్ కుమార్‌తో ప్రేమలో పడింది. వారి ప్రేమను పెద్దలు ఆంగీకరించరని భావించిన యువతి.. తాను ప్రేమించిన యువకుడితో పారిపోవడానికి నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ క్రైమ్ సీరియల్ చూసి.. తాను చనిపోయినట్లు సృష్టించడం కోసం పొరిగింటి కి చెందిన జీనత్ బేగం అనే మహిళను తన ఇంటికి పిలిచింది. ఆమెను ముచ్చట్లో పెట్టి గ్యాస్ సిలిండర్ సహాయంతో ఇంటికి మంటలు అంటించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మంటల్లో చిక్కుకున్న పొరుగింటి మహిళా పూర్తిగా కాలిపోయి చనిపోయింది. అయితే భార్య జీనత్‌ను చివరిసారిగా అఫ్షానా ఇంట్లో చూసిన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఈ విస్తు పోయే నిజాలు తెలిశాయి. దీంతో నిందితురాలు అఫ్సానా కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

* ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన-

రైలుపట్టాల కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య(commits suicide)కు పాల్పడిన విషాదకర సంఘటన బుధవారం హఫీజ్ పేట(Hafiz Peta)లో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన యార్లగడ్డ రాంబాబు నగరంలోని కొండాపూర్‌లో ఉంటూ ర్యాపిడో డ్రైవర్‌(Rapido driver)గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల కాలంలో అప్పుడు పెరిగిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* సైబర్‌నేరగాళ్ల ఆట కట్టించిన కేంద్ర ప్రభుత్వం

గడిచిన ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సైబర్‌నేరగాళ్ల ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున సైబర్‌ నేరాలను అడ్డుకుంది. సైబర్‌ నేరగాళ్లు కొట్టేయడానికి ప్రయత్నించిన రూ.1100 కోట్లను వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చివరి నిమిషంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆపగలిగారు. ఒక లక్ష జనాభాకుగాను గతేడాది అత్యధికంగా హర్యానాలో 381 సైబర్‌ క్రైమ్‌ నేరాలు రిపోర్ట్‌ అయ్యాయి. తెలంగాణలో 261, ఉత్తరాఖండ్‌ 243, గుజరాత్‌ 226, గోవాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఢిల్లీలో లక్ష జనాభాకు 755 కేసులు, చండీగఢ్‌లో 432 కేసులు నమోదయ్యాయి. సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా సైబర్‌ నేరగాళ్లకు చెందిన 2,95,461 సిమ్‌ కార్డులను, 2810 వెబ్‌సైట్‌లు, 585 మొబైల్‌ యాప్‌లు,46,229 ఐఎంఈఐలను కేంద్ర హోం శాఖ బ్లాక్‌ చేసింది.

* నిర్మల్‌ జిల్లా దిలావార్‌పూర్‌ రైతులు ఆందోళన

ఇథనాల్‌ పరిశ్రమ(Ethanol industry) నిర్మాణ పనులను ఆపేయాలని నిర్మల్‌(Nirmal) జిల్లా దిలావార్‌పూర్‌ రైతులు(Farmers) ఆందోళన విధ్వంసం సృష్టించారు. బుధవారం దాదాపు 10 వేల మంది రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. వ్యసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమపై ఇథనాల్‌ పరిశ్రమ కుంపటి పెట్టిందని మండిపడ్డారు. పంట భూములు బీడుగా మారుతాయని ఆవేదన చెందారు. అక్కడే ఉన్న స్కార్పియో, టిప్పర్‌ వాహనాలకు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆపేశారు. భాష్పవాయువు ప్రయోగించి రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి రైతులు ఆందోళన కొనసాగిస్తుండటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

* పదో తరగతి విద్యార్థిని టీచర్ వేధించిన సంఘటన

పదో తరగతి విద్యార్థిని టీచర్ వేధించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లో సైన్స్ ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ 10 వ తరగతి విద్యార్థినికి ఫోన్ లో అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. గత కొన్ని నెలలుగా వేధింపులు ఎక్కువ కావటం తో వేధింపులు తాళలేక విద్యార్థిని ఇంట్లో చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. స్కూల్ యాజమాన్యం పై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీచర్ సంజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బాలికపై వేధింపులకు పాల్పడిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

* హైదరాబాద్‌‌లోని ఉప్పల్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌‌లోని ఉప్పల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే మంటలు భారీగా చెలరేగడంతో షాపింగ్‌ మాల్‌ మొత్తం మంటలు వ్యాపించాయి. షాప్ మొత్తం కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలార్పారు. షాప్‌ క్లోజ్‌ చేశాక ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు పేర్కొంటున్నారు. భారీగా వస్తువులు కాలి బూడిదైనట్లు పేర్కొంటున్నారు.అయితే, ప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. కోట్లరూపాయల్లో ఆస్తినష్టం ఉంటుందని అంచనా వేశారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటా, వేరే కారణాలేవైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మాల్‌ సీసీఫుటేజీని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. రద్దీ సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. భారీగా ప్రాణ నష్టం జరిగేదని.. షాపు మూసివేసిన తర్వాత జరగడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. యజమానులు ఫైర్ సెఫ్టీపై దృష్టిసారించాలని కోరుతున్నారు.

* అస్సాంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం

అస్సాం(Assam)లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. గోలాఘాట్‌ జిల్లాలోని డెర్గావ్‌ సమీపంలో లారీ- బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం(Road accident) చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ‘తిలింగా మందిర్ వైపు వెళ్తోన్న బస్సు.. ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొంది. ఘటనాస్థలిలోనే 10 మంది చనిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని గోలాఘాట్‌ జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలియగానే స్థానికులు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z