DailyDose

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా కేంద్ర ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..121 యూపీఎస్సీ స్పెషలిస్ట్ గ్రేడ్ 3, సైన్స్ గ్రేడ్ బి, అసిస్టెంట్ జువాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఈ పోస్టులకు అర్హతలు, చివరి తేదీ గురించి తెలుసుకుందాం..

మొత్తం ఖాళీలు -121

ఖాళీల సమాచారం..

అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజ్ – 1
సైన్స్ బి – 1
అసిస్టెంట్ జువాలజిస్ట్- 7
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 – 112

విద్యార్హతలు..

అసిస్టెంట్ ఇండస్ట్రియల్ కన్సల్టెంట్: పీజీ/డిగ్రీ
సైంటిస్ట్ బి: ఎమ్మెస్సీ
అసిస్టెంట్ జువాలజిస్ట్: ఎంఎస్ఏసీ
స్పెషలిస్ట్ గ్రేడ్ 3: ఎంబీబీఎస్

దరఖాస్తు ఫీజు: ఇతరులకు దరఖాస్తు ఫీజు రూ. 25

మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఉచితం.. నగదు లేదా వీసా, మాస్టర్, రూపే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐ ద్వారా రుసుం చెల్లించవచ్చు..

వయోపరిమితి..

అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్ పోస్టుకు గరిష్ట వయస్సు 35 ఏళ్లు.
సైంటిస్ట్ (బి) పోస్టుకు అన్ రిజర్వ్ డ్ (యూఆర్ ) కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.
అసిస్టెంట్ జువాలజిస్ట్ పోస్టుకు అన్ రిజర్వ్ డ్ (యూఆర్) కేటగిరీ వారికి గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు.
అసిస్టెంట్ జువాలజిస్ట్ పోస్టుకు ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 33 ఏళ్లు.
అసిస్టెంట్ జువాలజిస్ట్ పోస్టులకు ఎస్సీలకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.
అసిస్టెంట్ సైంటిస్ట్ (బీ) పోస్టులకు ఎస్సీలకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు..

వయస్సు సడలింపు వివరాల గురించి నోటిఫికేషన్ లో చూడవచ్చు..

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 01-02-2024 రాత్రి 11.59 గంటలు.

ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రింట్ అవుట్ 2-2-2024 రాత్రి 11.59 గంటలకు వరకు అప్లై చేసుకోవచ్చు..

ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z