Videos

‘మట్కా’ గ్లింప్స్ రిలీజ్

‘మట్కా’ గ్లింప్స్ రిలీజ్

మెగా హీరో వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మ‌ట్కా’. ప‌లాస 1978 ఫేమ్ ‘కరుణకుమార్’ ఈ సినిమాకు దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రానుండగా నేడు వరుణ్ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ‘మట్కా’ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఇక ఈ టీజ‌ర్ గ‌మ‌నిస్తే.. కంప్లీట్‌గా పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇందులో వ‌రుణ్‌తేజ్ ముఖం మాత్రం చూపించ‌కుండా మిగ‌త పాత్ర‌ల‌ను రివీల్ చేశారు మేక‌ర్స్. ఇక గ్లింప్స్ మ‌ధ్య‌లో వరుణ్ ఎవరికో ప్రామిస్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో వ‌రుణ్ కనిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫ‌తేహీతో పాటు మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. న‌వీన్ చంద్ర‌, ర‌విశంక‌ర్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z