Politics

IRR Case: చంద్రబాబుపై ఛార్జిషీట్ దాఖలు

IRR Case: చంద్రబాబుపై ఛార్జిషీట్ దాఖలు

ఎన్నికలకు సన్నద్ధమవుతున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబుకు తాజాగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ప్రధాని నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణను ఏ2గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. సింగపూర్‌ ప్రభుత్వంతో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకుందంటూ అభియోగాలు మోపింది. ఈ కేసులో చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్‌తోపాటు లింగమనేని రాజశేఖర్‌, రమేశ్‌లను నిందితులుగా పేర్కొంది. సింగపూర్ – ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందమే లేదని సీఐడీ పేర్కొంది.సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిలేదని పేర్కొంది. చట్టవిరుద్ధంగా మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బు చెల్లింపులు చేసినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నిందితులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ డెవలప్‌మెంట్ ఏరియా/స్టార్టప్ ఏరియా ఉండేలా మాస్టర్ ప్లాన్‌ల డిజైన్‌ చేసినట్టు సీఐడీ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z