DailyDose

RGIA-బెదిరింపు మెయిల్స్‌ పంపిన వ్యక్తి అరెస్ట్-CrimeNews-Feb192024

RGIA-బెదిరింపు మెయిల్స్‌ పంపిన వ్యక్తి అరెస్ట్-CrimeNews-Feb192024

* శంషాబాద్‌ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్‌ పంపిన నిందితుడిని ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని బెంగళూరుకి చెందిన వైభవ్‌ తివారిగా గుర్తించారు. గతంలో రెండు సార్లు విమానాల్లో హైజాకర్లు వచ్చారని ఎయిర్‌పోర్ట్‌కి వైభవ్‌ మెయిల్స్‌ పంపాడు. అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు నిర్వహించి బెదిరింపు మెయిల్స్‌ నకిలీవిగా తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వైభవ్‌ను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. కొవిడ్‌ వల్ల ఐటీ ఉద్యోగం కోల్పోవడంతో మానసికంగా కుంగిపోయానని, ఆ డిప్రెషన్‌లోనే మెయిల్స్‌ పంపినట్లు వైభవ్‌ పోలీసులకు తెలిపాడు.

* సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌య‌మైన ఓ బాలిక‌ను ప్రేమ పేరుతో మ‌భ్య‌పెట్టి ఆమెకు ద‌గ్గ‌ర‌య్యాడు ఓ యువ‌కుడు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి, నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఆ బాలిక గ‌ర్భం దాల్చ‌డంతో ఈ విష‌యం వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. అమీర్‌పేట్‌కు చెందిన న‌వీన్ కుమార్(19) బైక్ మెకానిక్ చేస్తూ జీవ‌నం గ‌డుపుతున్నాడు. అత‌నికి సోష‌ల్ మీడియాలో పటాన్‌చెరుకు చెందిన 16 ఏండ్ల బాలిక ప‌రిచ‌య‌మైంది. దీంతో ఆమెను ప్రేమిస్తున్న‌ట్లు న‌మ్మించాడు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుంటాన‌ని మ‌భ్య‌పెట్టాడు. కొన్ని నెల‌ల త‌ర్వాత నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి.. ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.

* కాకినాడ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. టీఎస్ఆర్టీసీకి చెందిన బ‌స్సు.. విశాఖ‌ప‌ట్నం నుంచి భ‌ద్రాచ‌లం వెళ్తుండ‌గా క‌త్తిపూడి హైవేపై బోల్తా ప‌డింది. డ్రైవ‌ర్ భాస్క‌ర్ రావుకు బీపీ డౌన్ కావ‌డంతో బ‌స్సుపై ఆయ‌న నియంత్ర‌ణ కోల్పోయాడు. దీంతో బ‌స్సు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌కు దూసుకెళ్లి, బోల్తా ప‌డింది.

* మెద‌క్ మాజీ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి డ్రైవ‌ర్ శివ‌రాములు(42) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మెద‌క్ ప‌ట్ట‌ణంలోని పిల్లి కొట్ట‌ల్ ప్రాంతంలోని డ‌బుల్ బెడ్రూం హౌజ్ కాల‌నీలోని త‌న ఇంట్లో శివ‌రాములు ఉరేసుకున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం శివ‌రాములు త‌న భార్య‌తో గొడ‌వ ప‌డ్డాడు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన రాములు ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన స‌మ‌యంలో రాములు భార్య ఇంట్లో లేదు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z