Business

చందా కొచ్చర్ అరెస్ట్ చట్టవిరుద్ధం-BusinessNews-Feb202024

చందా కొచ్చర్ అరెస్ట్ చట్టవిరుద్ధం-BusinessNews-Feb202024

* అత్యాధునిక టెక్నాలజీ.. ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ డీప్ ఫేక్స్, వాయిస్ రికార్డులు వస్తుండటంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ వాటి భారీన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా ఇందుకోసం స్పెషల్ హెల్ప్ లైన్ ఏర్పాటు ఏర్పాటు చేయనున్నది. ఇంగ్లిష్‌తోపాటు చాట్ బోట్ ఫామ్‌లో వాట్సాప్ హెల్ప్‌లైన్ మూడు భాషలతో (హిందీ, తమిళం, తెలుగు) ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ నంబర్‌కు చాట్ బోట్ ద్వారా యూజర్లు టెక్ట్స్, ఇమేజ్, వీడియో మెసేస్ లపై దర్యాప్తు కోసం పంపొచ్చు. ఇందుకోసం మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయెన్స్ (ఎంసీఏ)తో భాగస్వామ్యం అవుతున్నామని మెటా తెలిపింది. వచ్చే నెల నుంచి ప్రజలకు ఈ హెల్ప్ లైన్ వినియోగంలోకి వస్తుంది. మెటా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ థుక్రాల్ మాట్లాడుతూ ప్రజలకు వచ్చే తప్పుడు సమాచారాన్ని ఏఐ ద్వారా గుర్తించవచ్చునన్నారు. ఇందుకు యావత్ టెక్నాలజీ పరిశ్రమ స్పష్టమైన, తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంసీఏ చైర్మన్ భారత్ గుప్తా మాట్లాడుతూ భారత్ లోని ఇంటర్నెట్ యూజర్లు, సోషల్ మీడియా యూజర్లకు వచ్చే తప్పుడు సమాచారం విస్తరించకుండా తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా తమ యూజర్లు ఎటువంటి `తప్పుడు సమాచారం లేదా డీప్ ఫేక్స్’ పోస్ట్ చేయకుండా చట్టబద్ధమైన బాధ్యత కలిగి ఉండాలని కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.

* దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ, జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ జత కట్టాయని తెలుస్తున్నది. రెండు సంస్థలు కలిసి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనున్నాయి. ఇందుకోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేస్తాయి. ఈ విషయమై జేఎస్‌డబ్ల్యూ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ సంస్థల మధ్య ఈ నెల ప్రారంభంలో చర్చలు జరుగుతాయని తెలుస్తున్నది. ఇటీవలే ఎలక్ట్రిక్ కార్లు, వాటిని నడపడంలో కీలకమైన బ్యాటరీల తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం ఒడిశా ప్రభుత్వంతో జేఎస్‌డబ్ల్యూ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. కటక్, పరదీప్‌ల్లో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్దని.

* ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ మాజీ ఎండీ కం సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టు రిలీఫ్ కల్పించింది. లోన్ ఫ్రాడ్ కేసులో కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌లను అరెస్ట్ చేసే విషయంలో చట్టం పట్ల సీబీఐ అధికారులకు గౌరవం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది అధికార దుర్వినియోగమేనని కొచ్చర్ దంపతుల అరెస్ట్ చట్ట విరుద్ధం అని జస్టిస్‌లు అనుజా ప్రభుదేశాయ్, ఎఆర్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. గతేడాది జనవరిలో మరో బెంచ్ దీపక్ కొచ్చర్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు సహకరించడం లేదన్న సీబీఐ వాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిందితులకు మౌనంగా ఉండే హక్కు ఉంటుందని తెలిపింది.

* వరుసగా ఆరో సెషన్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 73వేల మార్క్‌ను దాటగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. సెన్సెక్స్‌ మంగళవారం ఉదయం నష్టాల్లో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లు, ఆసియా మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో నష్టాల్లో మొదలయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే ఉదయం సెన్సెక్స్‌ 72,727.87 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. ఆ తర్వాత కోలుకున్నది.

* పాత పన్ను డిమాండ్ల ఉపసంహరణకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. 2015-16 మదింపు సంవత్సరం వరకున్న చిన్న పన్ను డిమాండ్ల ఉపసంహరణ కోసం ఒక్కో పన్ను చెల్లింపుదారునికి పరిమితిని లక్ష రూపాయలుగా నిర్దేశించింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన పథకం ప్రకారం ఈ మేరకు స్పష్టం చేసింది. 2010-11 మదింపు సంవత్సరం కోసం రూ.25,000 వరకున్న ట్యాక్స్‌ డిమాండ్లను, 2011-12 నుంచి 2015-16 మదింపు సంవత్సరాల కోసం రూ.10,000 వరకున్న ట్యాక్స్‌ డిమాండ్లను వెనక్కి తీసుకుంటామని ఈ నెల 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా మంత్రి సీతారామన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z