ScienceAndTech

ChatGPTకి పోటీగా Hanooman

ChatGPTకి పోటీగా Hanooman

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న వేళ భారత్ కూడా దీనికి పోటీగా.. అలాంటి సేవలని అందించాలనే ఉద్దేశ్యంగా అంబానీకి చెందిన రిలయన్స్, ఇతర ఐఐటీల సమన్వయంతో ఏర్పాటైన ‘భారత్ జీపీటీ’ వచ్చే నెలలో కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేయడానికి సంకల్పించింది. భారత్ జీపీటీ లాంచ్ చేయనున్న ఏఐ మోడల్​కు ‘హనూమాన్‌’ (Hanooman) అని నామకరణం చేశారు. ఈ హనుమాన్ ఏఐ మోడల్ మొత్తం 11 భాషల్లో సేవలను అందించనున్నట్లు సమాచారం. ఇందులో విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, పరిపాలన రంగాలకు చెందినవి ఉంటాయి. ఇప్పటికే భారత్ జీపీటీ హనూమాన్‌ ఏఐ మోడల్ పనితీరును తెలియజేసే వీడియోను ప్రదర్శించింది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా స్పీచ్​ టు టెక్ట్స్ కూడా​ జనరేట్ చేయవచ్చని సమాచారం. భారతీయుల అవసరాలకు అనుగుణంగా ఈ హనుమాన్ ఏఐ మోడల్‌ను డెవలప్ చేస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది.

రిలయన్స్ కంపెనీ ఇప్పటికే తమ సబ్‌స్క్రైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు ‘జియో బ్రెయిన్‌’ పేరిట ఓ మోడల్‌ను తయారు చేస్తోంది. మరోవైపు ఇండియన్ యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్వం, కృత్రిమ్ వంటి సంస్థలు కూడా ఏఐ మోడల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాట్​జీపీటీ, జెమినీ ఏఐ, ఏఐ గ్రోక్ వంటివి పుట్టుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇలాంటి టెక్నాలజీల అభివృద్ధికి సన్నద్ధమయ్యే అవకాశం ఉంది, ఇదే జరిగితే మరిన్ని ఏఐ మోడల్స్ పుట్టుకొస్తాయని పలువురు చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z