Business

క్రికెట్ చూస్తూ రైలు నడిపి 50మందిని చంపారు

క్రికెట్ చూస్తూ రైలు నడిపి 50మందిని చంపారు

లోకో పైలట్‌, సహాయ లోకో పైలట్‌ సెల్‌ఫోన్‌లో క్రికెట్‌ చూస్తూ రైలు నడపడంతోనే గతేడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్‌ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయని రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ శనివారం వెల్లడించారు. తమ శాఖలో తీసుకుంటున్న కొత్త భద్రతా చర్యల గురించి మాట్లాడుతున్న క్రమంలో కంటకాపల్లి ప్రమాదాన్ని ప్రస్తావించారు. 2023లో అక్టోబరు 29న కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం ఆగివున్న రాయగడ ప్యాసింజర్‌ను వెనుక నుంచి వచ్చిన విశాఖపట్నం పలాస ప్యాసింజర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ‘‘ఇటీవల జరిగిన ఈ ప్రమాదంలో పలాస ప్యాసింజర్‌లోని ఇద్దరు లోకో పైలట్లు రైలు నడుస్తుండగా డ్రైవింగ్‌పై పరధ్యానంగా ఉండి, సెల్‌ఫోన్‌లో క్రికెట్‌ చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇకపై విధుల్లో ఉన్న పైలట్ల తీరును నిత్యం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకొచ్చాం’’ అని మంత్రి వివరించారు. ఈ ప్రమాదం జరిగిన మర్నాడే దర్యాప్తునకు కమిటీ వేశామని, ఆ నివేదిక రాకముందే.. ప్రమాదానికి కారణమైన రాయగడ ప్యాసింజర్‌ లోకో పైలట్‌, సహాయ లోకో పైలట్‌లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z