Editorials

₹10కోట్ల పన్ను ఎగవేత కేసులో నారాయణ అల్లుడు

₹10కోట్ల పన్ను ఎగవేత కేసులో నారాయణ అల్లుడు

నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పి నారాయణ అల్లుడు పునీత్‌పై పన్నుల ఎగవేత కేసు నమోదు అయ్యింది. అంతేకాదు ఈ కేసు విచారణలో భాగంగా బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కోటికి పైగా నగదు సైతం సీజ్‌ చేశారు. ఈ సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. ‘‘ఇన్‌స్పైర్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారు. అంటే 10 కోట్ల పన్ను ఎగవేశారన్నమాట. ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు చూపించనందున రూ. కోటి 82 లక్షలు నగదు సీజ్ చేశాం..

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z