WorldWonders

ఆర్కిటిక్‌లో మంచు కనపడదు

ఆర్కిటిక్‌లో మంచు కనపడదు

2020-2030 మధ్యకల్లా ఉత్తర ధ్రువంలో ఉన్న ఆర్కిటిక్‌లో సంవత్సరంలో ఒక నెల పాటు తేలియాడే సముద్రపు మంచు కనిపించకపోవచ్చని కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఈ పరిస్థితి సంభవిస్తుందని అంచనా వేశారు. ఫలితంగా తీర ప్రాంతాల్లో సముద్ర నీటి మట్టాలు పెరిగి జన జీవనానికి ముప్పు తప్పదని వారు హెచ్చరించారు. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు వీటికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ‘జీరో ఐస్‌’ అంటే మంచు పూర్తిగా మాయమవడం కాదని, మహాసముద్రంలో 10 లక్షల చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ మంచు ఉండడమని శాస్త్రవేత్తలు వివరించారు. ఇది 1980లో సముద్రమీద పేరుకున్న మంచుకన్నా 20 శాతం తక్కువ అని తెలిపారు. ఆర్కిటిక్‌లో 30 లక్షల చదరపు కిలోమీటర్ల మేర మంచు ఉన్నట్లు ఇటీవల ఓ డాక్యుమెంటులో వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z